iDreamPost
android-app
ios-app

సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చాహల్! వీడియో పోస్ట్ చేసి మరీ..

  • Author Soma Sekhar Published - 04:53 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Published - 04:53 PM, Tue - 12 September 23
సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చాహల్! వీడియో పోస్ట్ చేసి మరీ..

వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి. టీమిండియా సైతం ఈ విశ్వ సమరానికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ జట్టులో కొంతమంది సీనియర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. అందులో ముఖ్యులు రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్. భారత జట్టు స్పిన్ దళానికి వీరిద్దరు వెన్నముకగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ వీరికి మాత్రం ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో చాహల్ కీలక నిర్ణయం తీసుకుని ఇంగ్లాండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కౌంటీ క్రికెట్ లో కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ లెగ్ స్పిన్నర్. తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయలేదన్న కసితో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. తాను వికెట్ తీసిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. సెలెక్టర్లకు కౌంటర్ ఇచ్చాడు.

యజ్వేంద్ర చహల్.. వరల్డ్ కప్ 2023లో చోటు దక్కించుకోలేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడంతో.. ఇంగ్లాండ్ కౌంటీల్లో పాల్గొంటున్నాడు ఈ లెగ్ స్పిన్నర్. ఈ కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా.. కెంట్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా కెంట్ వర్సెస్ నాటింగ్హమ్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో చాహల్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. వరల్డ్ కప్ లో చోటు దక్కలేదన్న కసిని.. ఈ టోర్నీలో చూపిస్తున్నాడు చాహల్.

ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు 28 ఓవర్లు వేసిన చాహల్ 10 ఓవర్లు మెయిడెన్ చేసి 59 రన్స్ ఇచ్చి.. 3 వికెట్లు తీసుకున్నాడు. అందులో ఓ అద్భుమైన వికెట్ తీసిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. స్ట్రాంగ్ హ్యాండ్ పిక్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో వరల్డ్ కప్ కు ఎంపిక చేయని సెలెక్టర్లకే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చాహల్ పెట్టిన వీడియో సెలెక్టర్లకు కౌంటరేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş