iDreamPost
android-app
ios-app

WWE సూపర్ స్టార్ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!

  • Published Feb 29, 2024 | 1:45 PM Updated Updated Feb 29, 2024 | 1:45 PM

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్(WWE)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను తన ఆటతీరుతో మెప్పించిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కన్నుమూశాడు.

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్(WWE)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను తన ఆటతీరుతో మెప్పించిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కన్నుమూశాడు.

  • Published Feb 29, 2024 | 1:45 PMUpdated Feb 29, 2024 | 1:45 PM
WWE సూపర్ స్టార్ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్(WWE) ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఎంటర్ టైన్ చేస్తోంది. జాన్ సీనా, ట్రిపుల్ హెచ్, ది గ్రేట్ ఖాలీ, అండర్ టేకర్ లాంటి ఎంతో మంది రెజ్లర్లు వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి ఈ క్రీడలో తాజాగా తీవ్ర విషాదం నెలకొంది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మైకేల్ జోన్స్(61) తుది శ్వాసవిడిచాడు. రెజ్లింగ్ ప్రపంచంలో ఇతడో సూపర్ స్టార్.

మైకేల్ జోన్స్.. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్(WWE)లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. రింగ్ లోకి దిగితే ప్రత్యర్థి వణకాల్సిందే. అంతలా అతడి డామినేషన్ ఉండేది. WWE అతడిని ప్రేక్షకులు ముద్దుగా ‘వర్జిల్’ అని పిలుచుకుంటారు. ఈ పేరుతోనే జోన్స్ ప్రసిద్ధి చెందాడు. తాజాగా మైకేల్ జోన్స్ తన 61 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈ విషయాన్ని జోన్స్ ఫ్రెండ్, ప్రొ- రెజ్లింగ్ రిఫరీ మార్క్ చార్ల్స్ III సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

“వర్జిల్, విన్సెంట్, సౌల్ ట్రెయిన్ గా మనందరికి సుపరిచితుడైన మైకేల్ జోన్స్ ఇక లేడనే వార్త మీతో పంచుకుంటున్నాడు. వర్జిల్ ప్రశాంతంగా ఆస్పత్రిలో కన్నుమూశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి” అని మార్క్ రాసుకొస్తూ.. సంతాపం వ్యక్తం చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు, జోన్స్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతడి కుటుంబానికి ప్రగాడసానుభూతి తెలియజేస్తున్నారు.

ఇదికూడా చదవండి: నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss