iDreamPost
android-app
ios-app

WWEలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్ స్టార్ మృతి!

  • Author Soma Sekhar Published - 10:19 AM, Fri - 25 August 23
  • Author Soma Sekhar Published - 10:19 AM, Fri - 25 August 23
WWEలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్ స్టార్ మృతి!

WWEలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. WWE సూపర్ స్టార్ , మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్(36) గుండె పోటుతో మరణించాడు. గత కొంత కాలంగా అతడు హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం అతడికి గుండెపోటు రావడంతో.. మరణించాడు. ఈ విషయాన్ని WWE చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అధికారికంగా ధృవీకరించాడు. కేవలం 36 ఏళ్లకే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మృతి చెందడం బాధాకరమైన విషయం అని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

WWE సూపర్ స్టార్, మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో గురువారం మరణించాడు. ఈ విషయాన్ని వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ధృవీకరించింది. బ్రే వ్యాట్ గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో గత కొంతకాలంగా అతడు రెజ్లింగ్ కు దూరంగా ఉన్నాడు. చివరగా అతడు ఈ ఏడాది జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

కాగా.. 2009లో బ్రే వ్యాట్ ప్రస్థానం రెజ్లింగ్ లో ప్రారంభం అయ్యింది. బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. ఇక ఈ సూపర్ స్టార్ మరణ వార్త తెలిసి మేము షాక్ కు గురైయ్యామని తెలిపాడు ట్రిపుల్ హెచ్. ఈ విషాద సమయంలో వ్యాట్ కుటుంబానికి ప్రతీ ఒక్కరు అండగా ఉండాలని ట్రిపుల్ హెచ్ ట్విట్టర్ వేదికగా సూచించాడు. అతడి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వారు తెలియజేశారు. ఇక వ్యాట్ తన కెరీర్ లో ఒక WWE ఛాంపియన్ షిప్ తో పాటుగా రెండు సార్లు యూనివర్సల్ ఛాంపియన్ షిప్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నాడు.


ఇదికూడా చదవండి: మేమంతా మ్యాచ్‌ విన్నర్లమే! మమ్మల్ని చూసి భయపడుతున్నారు: పాక్‌ బ్యాటర్‌

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap