iDreamPost
android-app
ios-app

Frances Mackay: వీడియో: క్రికెట్​లో ఎప్పుడూ చూడని వెరైటీ టాస్.. నేలకేసి కొడితే..!

  • Published Jan 11, 2024 | 3:27 PM Updated Updated Jan 11, 2024 | 3:27 PM

క్రికెట్​లో ఈ మధ్య వెరైటీ టాస్​లు ఎక్కువైపోయాయి. అయితే ఇలాంటిది మాత్రం ఎప్పుడూ చూసుండరు. అసలు ఇది టాసా? ఉల్లిగడ్డ బాంబా? అనేంత ఫన్నీగా ఉంది.

క్రికెట్​లో ఈ మధ్య వెరైటీ టాస్​లు ఎక్కువైపోయాయి. అయితే ఇలాంటిది మాత్రం ఎప్పుడూ చూసుండరు. అసలు ఇది టాసా? ఉల్లిగడ్డ బాంబా? అనేంత ఫన్నీగా ఉంది.

  • Published Jan 11, 2024 | 3:27 PMUpdated Jan 11, 2024 | 3:27 PM
Frances Mackay: వీడియో: క్రికెట్​లో ఎప్పుడూ చూడని వెరైటీ టాస్.. నేలకేసి కొడితే..!

గేమ్స్ అంటేనే ఎంటర్​టైన్​మెంట్. తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో ఆడియెన్స్​ను, ఫ్యాన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటారు ఆటగాళ్లు. అయితే ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​లతో పాటు కొన్ని వెరైటీ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమూ చూస్తూనే ఉన్నాం. కావాలని చేయకపోయినా ఆడే టైమ్​లో జరిగే సరదా ఘటనలు వైరల్ అవుతుంటాయి. క్రికెట్​లోనూ ఇలాంటివి చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ చేసే టైమ్​లో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే టాస్ సమయంలోనూ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగడం చూసే ఉంటారు. అలాంటి ఓ ఘటనే ఇది. విమెన్స్​ క్రికెట్​ మ్యాచ్ సందర్భంగా రెండు జట్ల కెప్టెన్లు టాస్ వేసేందుకు గ్రౌండ్​లోకి వచ్చారు. అయితే కాయిన్​ చేతుల్లోకి తీసుకున్న ఓ కెప్టెన్ వెరైటీగా టాస్ వేసింది.

సాధారణంగా టాస్​ టైమ్​లో ఎవరైనా కాయిన్​ను గాల్లోకి ఎగరేస్తారు. అయితే అంపైర్ చేతి నుంచి కాయిన్​ను తీసుకున్న ఫ్రాంకీ మెకే​ అనే ప్లేయర్ దాన్ని నేలకేసి బలంగా కొట్టింది. దీంతో అది కాస్తా దూరంగా వెళ్లి పడింది. డిఫరెంట్​గా టాస్ వేసినా ఆమె ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ మిలీ కేర్ టాస్ నెగ్గింది. ఆమె బ్యాటింగ్​ను ఎంచుకుంది. ఫ్రాంకీ మెకే టాస్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ విమెన్స్ సూపర్ స్మాష్ 2023-24 టోర్నమెంట్​లో చోటుచేసుకుంది. కాంటెబరీ విమెన్, వెల్లింగ్టన్ విమెన్ జట్ల మ్యాచ్​కు ముందు ఇది జరిగింది. వెరైటీ టాస్ వేసిన మెకే కాంటెబరీ టీమ్​కు కెప్టెన్​. బ్యాటింగ్​ ఆల్​రౌండర్ అయిన మెకే ఈ టోర్నీలో తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటిదాకా బ్యాట్​తో 163 రన్స్​ చేసిన ఆమె.. బంతితోనూ రాణిస్తూ 6 వికెట్లు పడగొట్టింది.

ఫ్రాన్సెస్ మెకే టాస్ వేసిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇదేం టాస్​ రా బాబు.. క్రికెట్​లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని అంటున్నారు. బిగ్​బాష్ లీగ్​లో బ్యాట్​తో టాస్ వేయడం చూశామని.. కానీ ఇది దానికి మించి ఉందని చెబుతున్నారు. అసలు ఇది టాసా? లేదా ఉల్లిగడ్డ బాంబా? కాయిన్​ను అంత కసిగా నేలకేసి బాదడం ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక్క టాస్​తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది ఫ్రాన్సెస్. లీగ్స్​ను పక్కనబెట్టి ఇంటర్నేషనల్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె న్యూజిలాండ్​ విమెన్ టీమ్​కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటిదాకా వన్డేల్లో 30 మ్యాచులు ఆడిన ఫ్రాన్సెస్ మెకే.. 313 పరుగులు చేసి.. 26 వికెట్లు పడగొట్టింది. టీ20ల్లోనూ అన్నే మ్యాచులు ఆడి 332 పరుగులు చేసి, 25 వికెట్లు తీసింది. మరి.. ఫ్రాన్సెస్ మెకే వెరైటీ టాస్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ప్రత్యర్థికి దినేష్ కార్తీక్ సాయం.. తేడా కొట్టిందా ఇక అంతే సంగతులు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet