England: ఇంగ్లండ్‌ డౌన్‌ఫాల్‌ మొదలైందా? వాళ్లు లేకుంటే అంతా డొల్లేనా?

James Anderson, Stuart Broad, England: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ గెలిచినప్పటికీ.. ఇంగ్లండ్ డౌన్ ఫాల్ మెుదలైందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు అనలిస్టులు. వారిద్దరు లేకపోతే.. ఇంగ్లండ్ డొల్లేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

James Anderson, Stuart Broad, England: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ గెలిచినప్పటికీ.. ఇంగ్లండ్ డౌన్ ఫాల్ మెుదలైందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు అనలిస్టులు. వారిద్దరు లేకపోతే.. ఇంగ్లండ్ డొల్లేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లండ్ కు గట్టి జట్టు అని పేరుంది. దీంతో పాటుగా సంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో తిరుగులేని ఆటతీరుతో ఇంగ్లండ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆ జట్టును ఓడించడం ఏ టీమ్ కు కూడా అంత ఈజీ కాలేదు. అయితే రానురాను ఆ జట్టు పరిస్థితి తీసికట్టుగా తయ్యారు అయ్యింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ ఆటతీరు ఓ పసికూనను తలపిస్తోంది. ఆ ఇద్దరు లేకుంటే.. బ్రిటీష్ జట్టు అంతా డొల్లేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు? ఓ సారి పరిశీలిద్దాం.

శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఇంగ్లండ్ 2-1తో గెలుచుకుంది. ఇక ఈ సిరీస్ లో స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ బ్యాటింగ్ తో అలరించాడు. సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శ్రీలంకపై సిరీస్ గెలిచినప్పటికీ.. ఇంగ్లండ్ డౌన్ ఫాల్ మెుదలైందని కొందరు అభివర్ణిస్తున్నారు. అదేంటి? బాగా ఆడితేనే కదా సిరీస్ గెలిచేది? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఇక్కడ మాట్లాడుకునేది ఇంగ్లండ్ బ్యాటింగ్ గురించి కాదు.. బౌలింగ్ గురించి. బ్యాటింగ్ లో ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది. కెప్టెన్ ఓలీ పోప్ రికార్డుల వీరుడు జో రూట్ లతో పాటుగా బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ లు ఉన్నారు. అయితే బౌలింగ్ విషయానికి వచ్చే సరికి ఆ జట్టు తేలిపోతున్నట్లుగా అనిపిస్తోంది.

జేమ్స్ అండర్సన్, స్టువర్ట్  బ్రాడ్.. ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దళానికి వీరిద్దరు దశాబ్ద కాలానికి పైగా నాయకత్వం వహించారు. వీరిద్దరు జట్టులో ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు ఒక పక్క వణుకు పుట్టాలి. మరీ ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ స్వింగ్ ను ఎదుర్కొవడం సచిన్ లాంటి దిగ్గజ బ్యాటర్ కు కూడా సవాలే. మరోవైపు స్టువర్ట్ బ్రాడ్ సైతం తన పేస్ బౌలింగ్ తో ఆపోజిట్ టీమ్ కు చుక్కలు చూపించేవాడు. ఇక సొంత గడ్డపై ఈ ద్వయం పూనకాలు వచ్చినట్లుగా చెలరేగిపోయేవారు. ఇలాంటి స్టార్ పేసర్లు క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలకడంతో ఒక్కసారిగా ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ విభాగంలో శూన్యం ఏర్పడింది. మార్క్ వుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పటికీ.. వీరిని రీ ప్లేస్ చేయలేకపోయారు. 2023లో బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. అండర్సన్ ఇటీవలే గుడ్ బై చెప్పాడు. బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లు, అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టారు.

కాగా.. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం బహీనంగా తయ్యారు అయ్యింది. ఆ విషయం సొంత గడ్డపై శ్రీలంకతో సిరీస్ లో బయటపడింది. తాజాగా లంకతో ముగిసిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో ఇంగ్లండ్ గెలుచుకుంది. కానీ బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. దిగ్గజాలు అండర్సన్, బ్రాడ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జోష్ హల్ లంక బ్యాటర్లను సొంత గడ్డపై వారిని కట్టడి చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా చివరి టెస్టులో లంక ఓపెన్ నిస్సాంక ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఇక బ్రిటీష్ బౌలర్లు వికెట్లు తీసినప్పటికీ.. సొంత గడ్డపై వారు చెలరేగాల్సిన తీరులో చెలరేగలేదు. అదే అండర్సన్, బ్రాడ్ ఉంటే వేరే విధంగా ఉండేదని క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో జట్టులో ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లు లేకుంటే.. ఇంగ్లండ్ పసికూనేనా? అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. అయితే శ్రీలంక లాంటి జట్టునే సొంత గడ్డపై ఎదుర్కొలేక పోయిన ఇంగ్లండ్.. ఇండియా, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఎలా ఢీ కొంటాయి అంటూ చెప్పుకొస్తున్నారు. మరి బ్రాడ్, అండర్సన్ లేకుంటే ఇంగ్లండ్ డొల్లేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments