వరల్డ్‌ కప్‌లో మూడోసారి 80 దాటి అవుటైన కోహ్లీ! ఎందుకిలా..?

విరాట్‌ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ తర్వాత సచిన్‌ అంతటోడు. సెంచరీల వేటలో సచిన్‌ వంద సెంచరీల రికార్డును వెంటాడుతున్న స్టార్‌ క్రికెటర్‌. కానీ, అదే ఇప్పుడు కోహ్లీకి మైనస్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఇది చదవండి

విరాట్‌ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ తర్వాత సచిన్‌ అంతటోడు. సెంచరీల వేటలో సచిన్‌ వంద సెంచరీల రికార్డును వెంటాడుతున్న స్టార్‌ క్రికెటర్‌. కానీ, అదే ఇప్పుడు కోహ్లీకి మైనస్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఇది చదవండి

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ విక్టరీలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ వరల్డ్‌ కప్‌లో ఓటమి ఎరుగని జట్టులా ఉంది టీమిండియా. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి.. సక్సెస్‌ఫుల్‌గా సెమీస్‌ దిశగా అడుగులేసింది. గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా లంక ముందు భారీ టార్గెట్‌ ఉంచింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే తొలి ఓవర్‌ రెండో బంతికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయినా కూడా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌(92), విరాట్‌ కోహ్లీ(88), శ్రేయస్‌ అయ్యర్‌(82) అద్భుతంగా ఆడి.. జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. అయితే.. ఈ ముగ్గురు కూడా సెంచరీలు పూర్తి చేసుకోకపోవడంతో క్రికెట్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఈ ముగ్గురిలో ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం వన్డేల్లో 48 సెంచరీలో ఉన్న కోహ్లీ.. మరొక్క సెంచరీ చేస్తే.. 49 సెంచరీలతో వన్డేల్లో సచిన్‌ టెండూల్కర్‌తో సమంగా నిలుస్తాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సెంచరీలో చేసిన రెండో బ్యాటర్‌గా ఉన్న కోహ్లీ తన సెంచరీ సంఖ్యను మరింత పెంచుకుంటాడు. నిజానికి కోహ్లీ ఆడితే సెంచరీనే కొట్టాలి అనేలా అతని ఫామ్‌ ఉంది. క్రికెట్‌ అభిమానులు సైతం కోహ్లీ నుంచి సెంచరీలు మాత్రమే ఆశిస్తున్నారు. అతను హాఫ్‌ సెంచరీలు చేస్తే.. ఫామ్‌లో లేడేమో అనే భావన క్రికెట్‌ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. అందుకు కారణం కోహ్లీ అలాంటి స్టాండెడ్స్‌ సెట్‌ చేయడమే. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ ఓ సూపర్‌ స్టార్‌. క్రికెట్‌ దేవుడు సచిన్‌ తర్వాత సచిన్‌ అంతటోడు.

అయితే.. కొంతకాలం విరాట్‌ కోహ్లీకి సెంచరీ ఫోబియా పట్టుకుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తనకు తెలియకుండానే సెంచరీ కొట్టాలనే ఒత్తిడి కోహ్లీ ఫీల్‌ అవుతున్నాడు. కోహ్లీ 80ల్లోకి వచ్చిన వెంటనే అది క్లియర్‌గా అతని ఫేస్‌లో తెలిసిపోతుంది. సెంచరీ పూర్తి చేయాలనే ప్రెజర్‌ కనిపిస్తోంది. అప్పటి వరకు ఎంతో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీ.. సెంచరీకి దగ్గరగా రాగా, డాట్‌ బాల్స్‌ ఎక్కువగా ఆడుతూ.. సింగిల్స్ మాత్రమే తీస్తూ కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు ఒత్తిడిని బ్రేక్‌ చేయడానికి భారీ షాట్లు ఆడి అవుట్‌ అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, అలాగే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అలాగే అవుట్‌ అయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసినా.. కేఎల్‌ రాహుల్‌ సింగిల్స్‌ రిజక్ట్‌ చేయడంతో సాధ్యమైంది. ఇలా కోహ్లీ సెంచరీలు చేయాలనే ఒత్తిడిని ఫీల్‌ అవుతూ.. కొద్ది పరుగుల దూరంలో వికెట్‌ సమర్పించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా 85, న్యూజిలాండ్‌ 95, ఇప్పుడు శ్రీలంకపై 88 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. నిజానికి మునుపటి కోహ్లీ అయితే.. ఇవన్నీ కచ్చితంగా సెంచరీలే. అయినా 78 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నా ఆటగాడు ఇలా.. సెంచరీల కోసం ఒత్తిడికి లోనుకావడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments