Nidhan
IND vs BAN, Kuldeep Yadav: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్ట్రా స్పిన్నర్‌ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టడంతో విస్తుపోయారు.
IND vs BAN, Kuldeep Yadav: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్ట్రా స్పిన్నర్‌ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టడంతో విస్తుపోయారు.
Nidhan
భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. రెండు టెస్టుల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్ట్రా స్పిన్నర్‌ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టడం ఏంటని విస్తుపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేస్ బౌలర్లను ఆడించాలని డిసైడ్ అయింది. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. స్పిన్ విభాగం బాధ్యతల్ని రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మోస్తున్నారు. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది మెన్ ఇన్ బ్లూ. అంతా బాగానే ఉన్నా కుల్దీప్ను ఎందుకు తీసుకోలేదనే చర్చ మొదలైంది. దీనికి ఓ రీజన్ ఉంది.
సాధారణంగా చెన్నైలో టెస్ట్ మ్యాచ్ అంటే పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. మన దేశంలో ఉన్న కంప్లీట్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లలో ఒకటిగా చెపాక్‌ను చెబుతుంటారు. ముగ్గురు స్పిన్నర్లతో ఇక్కడ బరిలోకి దిగడం భారత్‌కు రివాజుగా మారింది. ఈ గ్రౌండ్లో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కరి చేసి భారీ విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ ఈసారి రోహిత్ శర్మ ప్లాన్ మార్చాడు. రీసెంట్గా పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ వైట్‌వాష్ చేసింది. అందులో షకీబ్ అల్ హసన్‌తో పాటు మెహ్దీ హసన్ మిరాజ్ లాంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఇదే స్పిన్ అటాక్‌తో టర్నింగ్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై రోహిత్ సేనను కూడా ఓడిస్తామంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో కొన్నాళ్ల కింద భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కొన్నాళ్లుగా టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఫెయిల్ అవడం, రోహిత్ మినహాయించి మిగతా బ్యాటర్లకు స్పిన్ వీక్నెస్గా మారడంతో చెన్నై పిచ్‌ను పేస్ ట్రాక్‌గా ఛేంజ్ చేయించారు.
బుమ్రా, సిరాజ్‌తో కూడిన బలమైన పేస్ అటాక్‌తో బంగ్లాకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన రోహిత్-కోచ్ గంభీర్.. అందులో భాగంగానే నల్ల మట్టికి బదులు చెపాక్‌లో ఎర్ర మట్టి వికెట్‌ను తయారు చేయించారు. ముగ్గురు స్పిన్నర్లకు బదులు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల అటాక్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కుల్దీప్కు బదులు సీమర్ ఆకాశ్‌దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. సహజంగా స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో ఎప్పటిలాగే నల్ల మట్టి పిచ్ రూపొందిస్తే కుల్దీప్ టీమ్‌లో ఉండేవాడు. కానీ ప్రత్యర్థికి ముక్కుతాడు వేయడానికి కాస్త డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లిన రోహిత్ అండ్ కో చైనామన్ బౌలర్‌కు బదులు ఆకాశ్‌దీప్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ తెలిసిపోతుంది. పిచ్ మార్పు, కుల్దీప్ను పక్కనబెట్టడం భారత్‌కు కలిసొస్తుందో లేదో ఇంకొన్ని సెషన్స్‌తో తేలిపోతుంది. మరి.. కుల్దీప్ను పక్కనబెట్టడం కరెక్టా? కాదా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.