కోచ్‌గా గంభీరే కరెక్ట్‌ అని BCCI ఎందుకు ఫిక్సైంది? అతనే కప్పులు గెలిపిస్తాడని ఎలా నమ్ముతోంది?

Gautam Gambhir, Head Coach, BCCI: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీరే ఉండాలని బీసీసీఐ ఎందుకంతా బలంగా పట్టుబడుతోంది. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, Head Coach, BCCI: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీరే ఉండాలని బీసీసీఐ ఎందుకంతా బలంగా పట్టుబడుతోంది. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ వస్తున్నాడని, బీసీసీఐ అతన్ని హెడ్‌ కోచ్‌గా తెచ్చేందుకు ఫిక్స్‌ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గంభీర్‌ ఇంటర్వ్యూ కూడా పూర్తి అయిపోయినట్లు.. అధికారికంగా నేడో రేపో గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా ప్రకటిస్తారనే ప్రచారం నడుస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ధనికి బోర్డుగా ఉన్న బీసీసీఐ.. టీమిండియా హెడ్‌ కోచ్‌కు భారీ మొత్తంలో జీతభత్యాలు ఇస్తోంది. పైగా టీమిండియాకు లాంటి పెద్ద టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా పనిచేయడం చాలా మంది గౌరవంగా భావిస్తారు. అందుకే టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి భారీ డిమాండ్‌ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లు, కోచ్‌లు ఇందుకోసం ఆసక్తి చూపిస్తారు. కానీ, బీసీసీఐ మాత్రం గంభీర్‌నే ఆ పోస్ట్‌లోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేసింది.

గంభీర్‌నే టీమిండియా హెడ్‌ కోచ్‌గా చేయాలని బీసీసీఐ ఎందుకు అంతలా తాపత్రయపడుతోంది. 2011 తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవని టీమిండియాకు గంభీరే కప్పులు అందిస్తాడనే బీసీసీఐ అంత బలంగా ఎందుకు నమ్ముతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. గౌతమ్‌ గంభీర్‌ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతని ఆటను, యూటిట్యూడ్‌ను, భావావేశాలు చూసిన ఎవరికైన.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఇజ్‌ ద రైట్‌ పర్సన్‌ అని అనిపిస్తుంది. ఆటగాడిగా గంభీర్‌ ఏం సాధించాడు అనే విషయం పక్కనపెడితే.. ఆట పట్ల అంతని అంకితభావానికి ఎవరైన ఫిదా కావాల్సిందే.

క్రికెట్‌లో గెలవాలంటే.. ఒకరిద్దరి వల్ల కాదు, ఇది టీమ్‌ గేమ్‌, జట్టులోని 11 మంది కలిసి కట్టుగా ఆడితే విజయం సాధించవచ్చని బలంగా నమ్మే వ్యక్తి గంభీర్‌. అది అతని ఆటను, మాటలను బట్టి కూడా తెలుస్తోంది. పైగా ఆస్ట్రేలియా జట్టులో ఉంటే మైండ్‌ సెట్‌ గంభీర్‌లో ఉంటుంది. టీమ్‌ ఎఫర్ట్‌ను బాగా నమ్ముతాడు అలాగే చివరి వరకు ఓటమిని అస్సలు ఒప్పుకోడు. గ్రౌండ్‌లోకి దిగితే.. గెలిచే వరకు ఫోకస్‌ తప్పకుండా చూసుకుంటాడు. మ్యాచ్‌ గెలిచేందుకు వన్‌ పర్సెంట్‌ ఛాన్స్‌ ఉన్నా వదిలిపెట్టడు.. మ్యాచ్‌ను అంత ఈజీగా ప్రత్యర్థికి ఇచ్చేయడు.. చివరి బాల్‌ వరకు, చివరి రన్‌ వరకు అదే కసితో ఉంటాడు. ప్రస్తుతం మన జట్టులో మిస్‌ అవుతుంది ఇదే. గెలిస్తే బలంగా గెలుస్తున్నారు లేదా తేలిగ్గా ఓడిపోతున్నారు. అలా కాకుండా ఓటమిని ఒప్పుకోని నైజం అలవాటు అయితే.. టీమిండియాకు ఉన్న బలానికి ఎదురునిలిచే జట్టు ప్రపంచంలోనే లేదు.

2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ చూస్తే.. గంభీర్‌ ఏం చేశాడో తెలుస్తోంది. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, బిగ్‌ గేమ్స్‌లో ఎలా ఆడాలి, చివరి వరకు ఎలా పోరాటం చేయాలని చేసి చూపిన ఆటగాడు. పైగా తన వ్యక్తి రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడిన ప్లేయర్‌. వన్డే వరల్డ్‌ కప్‌ 2011 ఫైనల్‌లో గంభీర్‌ 97 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. అదే ప్లేస్‌లో వేరే ప్లేయర్‌ ఉంటే కచ్చితంగా సెంచరీ పూర్తి చేసుకోవాలి చూస్తూ కాస్త నిదానంగా అయినా ఆడి సెంచరీ కంప్లీట్‌ చేసుకునే వాడు. కానీ, గంభీర్‌ అలా ఆడకుండా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సెంచరీకి 3 పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు. మెంటర్‌గా మారిన తర్వాత కూడా గంభీర్‌ అదే మైండ్‌ సెట్‌తో ఉన్నాడు. తాజాగా ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అంతకు ముందు 2012, 2014లో కెప్టెన్‌గా కేకేఆర్‌కు రెండు కప్పులు అందించాడు. అందుకే గంభీర్‌ అయితే.. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కప్పులు అందించగలడని బీసీసీఐ భావిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments