Virat Kohli: టీ20 టీమ్‌లో కోహ్లీ ప్లేస్‌ ఎవరిది? ఆ ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ!

Virat Kohli, Indian T20 Team: భారత టీ20 జట్టులో కోహ్లీ వదిలిపెట్టి వెళ్లిపోయిన ప్లేస్‌ను ఏ ప్లేయర్‌ ఆక్రమిస్తాడో అని క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఆ అవకాశం ఇద్దరు ఆటగాళ్లు ఉంది. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Indian T20 Team: భారత టీ20 జట్టులో కోహ్లీ వదిలిపెట్టి వెళ్లిపోయిన ప్లేస్‌ను ఏ ప్లేయర్‌ ఆక్రమిస్తాడో అని క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఆ అవకాశం ఇద్దరు ఆటగాళ్లు ఉంది. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం దేశమంతా ఒక విషయం కోసం ఎదురుచూస్తోంది.. అదే టీమిండియా ఆటగాళ్ల విక్టరీ పరేడ్ కోసం. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను భారత జట్టు సాధించిన విషయం తెలిసిందే. జూన్‌ 29న బార్బోడోస్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో రోహిత్‌ సేన విజయం సాధించి.. గురువారం స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి.. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత.. ముంబై వెళ్లి.. అక్కడ విక్టరీ పరేడ్‌ నిర్వహించనుంది. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ ముగిసిన వెంటనే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ లేకపోవడంతో మరి టీ20ల్లో కోహ్లీ ప్లేస్‌ను ఎవరు ఆక్రమిస్తారనే చర్చ మొదలైంది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా ఆడినా.. ఎక్కువ మ్యాచ్‌లు వన్‌డౌన్‌లోనే ఆడాడు. వన్‌డౌన్‌లోనే కోహ్లీ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. దశాబ్ధకాలంగా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో వన్‌డౌన్‌ ప్లేస్‌ విరాట్‌ కోహ్లీకి అంకితమైపోయింది. కోహ్లీ ఉండగా.. ఆ ప్లేస్‌లో ఆడే మొనగాడు ఇంకా టీమిండియాలోకి రాలేదు. ఆ ప్లేస్‌లో కోహ్లీ చూపించిన ఇంప్యాక్ట్‌ అలాంటిది. అయితే.. ఇప్పుడు కోహ్లీ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. టీ20ల్లో వన్‌ డౌన్‌లో ఆడే ప్లేయర్‌ ఎవరా అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్లేస్‌ కోసం ఓ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.

వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు సంజు శాంసన్‌ కూడా విరాట్‌ కోహ్లీ ప్లేస్‌ కోసం పోటీ పడుతున్నారు. కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, జడేజా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. ప్రస్తుత టీమ్‌లో మూడు ప్లేస్‌లు ఖాళీ అయ్యాయి. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఆడిన సూర్య ఇకపై వన్‌ డౌన్‌లో ఆడొచ్చే. లేదా సంజు శాంసన్‌ వన్‌డౌన్‌లో ఆడుతూ.. సూర్య అదే నాలుగో ప్లేస్‌కు పరిమితం కావొచ్చు. వీళ్లిద్దరు కాకుండా టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో వన్‌ డౌన్‌లో ఆడిన రిషభ్‌ పంత్‌కు కూడా అవకాశం ఉంది. కానీ, పంత్‌ మిడిల్డార్‌లోనే బాగా రాణిస్తున్నాడు. మరి విరాట్‌ కోహ్లీ వదిలేసిన వన్‌డౌన్‌లో ఎవరు ఆడితే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments