యువరాజ్‌ బయోపిక్‌ స్టార్ట్! హీరో యువీనే.. మరి విలన్‌ అతనేనా?

Yuvraj Singh, Biopic, MS Dhoni, T Series: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ ప్రకటన రాగానే.. క్రికెట్‌ అభిమానుల్లో ఒక ఆలోచన మొదలైంది. యువీ బయోపిక్‌లో విలన్‌ ఎవరు? అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Yuvraj Singh, Biopic, MS Dhoni, T Series: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ ప్రకటన రాగానే.. క్రికెట్‌ అభిమానుల్లో ఒక ఆలోచన మొదలైంది. యువీ బయోపిక్‌లో విలన్‌ ఎవరు? అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులకు పండుగలాంటి వార్త వెల్లడించింది టీ-సిరీస్‌ సంస్థ. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో యువరాజ్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ క్రికెట్‌ జీవితాన్ని వెండితెరపై చూసుకొని మురిసిపోతాం అంటూ.. తెగ సంబరపడిపోతున్నారు. యువీ బయోపిక్‌ తీస్తున్నట్లు.. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాతలు భుషణ్ కుమార్, రవిభాగ్ చందక్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామన్నారు. యువ క్యారెక్టర్‌, అలాగే మిగతా క్యారెక్టర్లు ప్లే చేసే నటీనటుల వివరాలు కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యువీ బయోపిక్‌లో.. యువరాజ్‌ క్యారెక్టర్‌ హీరోగా ఉంటుందనేది తెలిసిన విషయమే. మరి విలన్‌గా ఎవరుంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే.. యువీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సినిమాకు సరిగ్గా సరిపోయే స్టఫ్‌ అంతా అతని జీవితంలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక యువ ప్లేయర్‌ సృష్టించిన సంచలనాలు, టీమిండియాలో స్టార్‌గా ఎదిగి.. రెండు వరల్డ్‌ కప్‌లు అందించిన హీరోగా నిలవడం, క్యాన్సర్‌తో పోరాడుతూనే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడటం, క్యాన్సర్‌ను జయించి.. మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఇలా.. అనే ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వీటితో పాటు.. యువీకి కెప్టెన్సీ దక్కకపోవడం, అంత మంచి కెరీర్‌కు సరైన ముగింపులేకపోవడం వంటి కాంట్రవర్సీలు కూడా యువీ లైఫ్‌లో ఉన్నాయి. మరి వాటిని బయోపిక్‌లో ప్రస్తావిస్తే.. విలన్‌గా ఎవర్ని చూపిస్తారనే విషయంపై కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే.. కొంతమంది మాత్రం.. యువీ క్రికెటింగ్‌ లైఫ్‌లో ఉన్న విలన్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనినే అని అంటున్నారు. నిజానికి టీమిండియాలో ఒక సీనియర్‌ సక్సెస్‌ఫుల్‌ ప్లేయర్‌గా ధోని కంటే ముందు.. యువరాజ్‌ సింగ్‌కు భారత జట్టు కెప్టెన్సీ దక్కాల్సింది. కానీ, కొందరి సూచనలతో ధోనికి కెప్టెన్సీ దక్కింది. ధోని కెప్టెన్సీలో ఎంతో అద్భుతంగా ఆడి.. టీమిండియాకు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిపించాడు యువీ. ఆ రెండు మెగా టోర్నీలో బాల్‌, బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు యువీ. కానీ, వరల్డ్‌ కప్‌లు గెలిపించిన కెప్టెన్‌గా ధోనికే ఎక్కువ క్రెడిట్‌ దక్కింది. పైగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో యువీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. యువీకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

వన్డే వరల్డ్‌ కప్‌ 2011 తర్వాత.. యువ క్యాన్సర్‌ బారిన పడి.. ఆ మహమ్మారిని జయించి.. తిరిగి టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యువీకి ధోని నుంచి సరైన సపోర్ట్‌ లభించలేదని కూడా కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తూ ఉంటారు. యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ కూడా చాలా సందర్భాల్లో ధోని స్వార్థపరుడంటూ.. యువీకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేశాడంటూ మండిపడ్డాడు. ఒక కెప్టెన్‌గా ఉన్న ధోని.. టీమిండియాలో దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగిన యువీకి.. తన కెరీర్‌లో సరైన ముగింపు లేకుండా చేశాడంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు ధోనిని విమర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ మరి యువీ బయోపిక్‌లో చూపిస్తారా? ఒక వేళ చూపిస్తే.. ధోనిని విలన్‌గా ప్రోజెక్ట్‌ చేస్తారా లేదా వేచి చూడాలి. అయితే.. ఇన్ని కాంట్రవర్సీ ఇష్యూలు ఉన్నా.. యువీ-ధోని మంచి ఫ్రెండ్స్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం చాలా సార్లు వాళ్లే చెప్పారు. ధోని బయోపిక్‌లో యువీని హీరోగా చూపించారు.. మరి యువీ బయోపిక్‌లో ధోనిని ఎలా చూపిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments