SNP
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో కొన్ని పొరపాట్లు పెద్దగా వెలుగులోకి రావడం లేదు. కానీ, ఫలితం వేరేలా ఉంచి ఉంటే.. అవే పెద్ద తప్పిదాల్లా కనిపించేవి. వాటిలో ఇది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో కొన్ని పొరపాట్లు పెద్దగా వెలుగులోకి రావడం లేదు. కానీ, ఫలితం వేరేలా ఉంచి ఉంటే.. అవే పెద్ద తప్పిదాల్లా కనిపించేవి. వాటిలో ఇది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్రేకుల్లేని బుల్లెట్ బండిలా దూసుకెళ్తోంది. ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో కంఫర్ట్‌గా గెలిచింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లను.. డారిల్ మిచెల్-రచిన్ రవీంద్ర జోడీ ఎదురుదాడి చేసి 3వ వికెట్‌కు భారీ భాగస్వామ్య నమోదు చేసింది. తర్వాత టీమిండియా బౌలర్లు, ముఖ్యంగా షమీ చెలరేగడంతో 300లకు పైగా పరుగులు చేయాల్సిన కివీస్ 273కే పరిమితం అయింది. 274 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌ను టీమిండియా చాలా కంఫర్ట్‌బుల్‌గానే చేసినా.. కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నాయి. విజయం.. వాటిని కప్పిపుచ్చుతున్నా.. అనుకోని ఫలితం వచ్చి ఉంటే అవే హైలెట్ అయ్యేవి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే.. 300లకి పైగా స్కోర్ చేయాల్సిన న్యూజిలాండ్‌ను కేవలం 273 పరుగులకే కట్టడి చేయడమే టీమిండియా విజయానికి దోహదం చేసింది. ఇక ఛేజింగ్‌లో కెప్టెన్ రోహత్ శర్మ ఎప్పటిలానే అగ్రెసివ్ ఇటెంట్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన తర్వాత.. రెండు వికెట్లు వెంటవెంటనే పడినా.. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌ను టీమ్‌ను ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 95 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌కే హైలెట్‌గా మారాడు. అయితే.. పాపం, తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అవుటైన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది.
182 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా 4వ వికెట్ కోల్పోయిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఈ వరల్డ్ కప్‌లో తొలి సారి ఆడుతున్నాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. అయితే.. ఈ రనౌట్‌లో తప్పు సూర్యకుమార్ యాదవ్‌దా? కోహ్లీ తప్పుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ రనౌట్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో చోటు చేసుకుంది. బౌల్ట్ బౌలింగ్‌లో ఐదో బంతిని కవర్స్ దిశగా కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. బాల్‌ని చూడుకుండా రన్ కోసం పరిగెత్తాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ బాల్‌ను ఫీల్డర్ ఆపుతాడా లేదా అని చూస్తూ ముందుకు అడుగులేశాడు. ఫీల్డర్ సాంట్నర్ డైవ్ చూస్తూ బాల్ ఆపడం చూసి వెనక్కి వచ్చేశాడు.
కానీ, అప్పటికే సూర్య నాన్‌స్ట్రైకర్ క్రీజ్‌కు దగ్గరగా వచ్చాడు. బాల్ సాంట్నర్ నుంచి బౌలర్ బౌల్ట్ దగ్గరికి అక్కడి నుంచి కీపర్‌కి చకచకా వెళ్లిపోయింది. సూర్య వెనక్కితిరిగి పరిగెత్తినా ఫలితం లేకపోయింది. దీంతో సూర్య రనౌట్ అయ్యాడు. అయితే.. ఈ రనౌట్‌లో ఇద్దరిలో ఎవరినీ తప్పుపట్టడానికి లేదు. మరీ తొలుతగా ఆలోచిస్తే..సూర్యదే తప్పు ఉండొచ్చు. కోహ్లీ నో అని చెబుతున్నాడు.. కోహ్లీ వైపు చూడకుండా రన్ కోసం ప్రయత్నించాడు. అయితే.. కోహ్లీ కోసం సూర్య వికెట్‌ను త్యాగం చేయడంలో కూడా తప్పు లేదని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఆ టైమ్‌లో కోహ్లీ క్రీజ్‌లో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
सूर्य कुमार यादव का आउट होना आज मुझे सोने नहीं देगा।
जीत की बधाई टीम इंडिया❤🇮🇳#SuryakumarYadav #ICCCricketWorldCup pic.twitter.com/YOziMOJcv3
— Rishabh Yadav (@Rishabhji1200) October 22, 2023
ఇదీ చదవండి: World Cup: ఇండియా vs కివీస్ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయో తెలుసా?