T20 Captain: కొత్త టీ20 కెప్టెన్‌ ఎవరు? రోహిత్‌ వారుసుడిగా.. ఈ నలుగురిలో ఒకరి ఛాన్స్‌!

T20 Captain: కొత్త టీ20 కెప్టెన్‌ ఎవరు? రోహిత్‌ వారుసుడిగా.. ఈ నలుగురిలో ఒకరి ఛాన్స్‌!

Hardik Pandya, Rishabh Pant: రోహిత్‌ శర్మ వారుసుడిగా భారత టీ20 జట్టు పగ్గాలు ఎవరు అందుకుంటారని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఓ నలుగురు ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్స్‌ ఉంది. ఆ నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Rishabh Pant: రోహిత్‌ శర్మ వారుసుడిగా భారత టీ20 జట్టు పగ్గాలు ఎవరు అందుకుంటారని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఓ నలుగురు ఆటగాళ్లకు ఎక్కువ ఛాన్స్‌ ఉంది. ఆ నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20లకు రిటైర్మెంట్‌ ఇస్తే.. కెప్టెన్సీకి కూడా రాజీనామా చేసినట్లే లెక్క. దీంతో.. టీ20 ఫార్మాట్‌కు టీమిండియాకు కొత్త కెప్టెన్‌ అవసరం ఏర్పడింది. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. యంగ్‌ టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అతను కేవలం ఈ సిరీస్‌కు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి ఆ తర్వాత.. టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై ఆసక్తిగా నెలకొంది.

ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన టీమ్‌ నుంచి ఓ నలుగురు ఆటగాళ్లకు భారత టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ నలురుగు ఎవరు? ఎవరికి ఎంత మేర ఛాన్స్‌ ఉందో ఇప్పుడు చూద్దాం.. రోహిత్‌ శర్మ వారుసుడిగా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడితే.. వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ 2026 వరకు వాళ్లే కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాకు హార్ధిక్‌ పాండ్యా టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. టీమిండియా ఈ టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే.. పాండ్యా పాత్ర కూడా కీలకం. ఎలాగో వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి అతనికే టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుతాయని అంతా భావిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే పాండ్యాకే ఎక్కువ ఛాన్స్‌ ఉంది. ఒక పాండ్యాతో పాటు మరో ముగ్గురు కూడా టీ20 కెప్టెన్‌ రేసులో ఉన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌. సూపర్‌ ఫామ్‌లో ఉండి టీమిండియాకు రోహత్‌, కోహ్లీ తర్వాత అంత పెద్ద దిక్కుగా ఉన్న స్టార్‌ బౌలర్‌ బుమ్రాకు కూడా టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌ కావాలని బుమ్రా కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. ఇక టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా భారత టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. కొత్త కోచ్‌గా వస్తాడని అనుకుంటున్న గంభీర్‌తో సూర్యకు మంచి ర్యాపో ఉంది. అది అతనికి ప్లస్‌ కావొచ్చు. ఒక గంభీర్‌ ఎలాగో యంగ్‌ టీమ్‌ను కోరుకుంటున్నాడు కాబట్టి.. రిషభ్‌ పంత్‌ను టీ20లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి ఈ నలుగురిలో ఎవరు టీ20 కెప్టెన్‌ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments