iDreamPost
android-app
ios-app

Brian Lara: 27 ఏళ్ల తరువాత వెస్టిండీస్ విజయం.. లైవ్ లో కన్నీరు పెట్టేసిన బ్రియాన్ లారా

  • Published Jan 29, 2024 | 8:18 AM Updated Updated Jan 29, 2024 | 8:38 PM

27 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం లభించడంతో.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా లైవ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

27 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం లభించడంతో.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా లైవ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Jan 29, 2024 | 8:18 AMUpdated Jan 29, 2024 | 8:38 PM
Brian Lara: 27 ఏళ్ల తరువాత వెస్టిండీస్ విజయం.. లైవ్ లో కన్నీరు పెట్టేసిన బ్రియాన్ లారా

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్ట్ ఓటమి నుంచి ఘనంగా పుంజుకుని రెండో టెస్ట్ లో ఆతిథ్య ఆసీస్ ను 8 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో విండీస్ క్రికెట్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దానికి కారణం.. 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై విండీస్ తొలి విజయాన్ని నమోదు చేయడమే. దీంతో గబ్బా స్టేడియం మెుత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. ఇక ఈ అపూర్వ విజయాన్ని చూసిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కామెంట్రీ బాక్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం విండీస్ విజయాన్ని లారాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా గడ్డపై గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులు తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది కరేబియన్ టీమ్. యువ పేసర్ షమర్ జోసెఫ్ సంచలన బౌలింగ్ ముందు.. కంగారూ బ్యాటర్లు నిలవలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లో అతడు ఏకంగా 7 వికెట్లతో చెలరేగి, ఆసీస్ పతనాన్ని శాసించాడు. తన బొటన వేలికి గాయం అయినప్పటికీ.. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

ఇక 27 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై విండీస్ టీమ్ కు తొలి విజయం దక్కడంతో.. లైవ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ను కామెంట్రీ బాక్స్ నుంచి వీక్షిస్తున్న లారా.. తమ జట్టు విజయం సాధించడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైయ్యాడు. కన్నీరు పెట్టుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు లారా. సహచర కామెంటేటర్ ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. గిల్ క్రిస్ట్ కూడా విండీస్ విజయాన్ని ఆస్వాదించాడు. ఇది వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన విజయమని, దీన్ని మర్చిపోలేమని లారా ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరకాల స్వప్నం నెరవేరినప్పుడు ఎవ్వరైనా కన్నీరు కార్చాల్సిందే అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి విండీస్ సాధించిన చరిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss