Somesekhar
క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా తుపాకీలతో ఓ స్టార్ ఆల్ రౌండర్ ని బెదిరించారు. ఆ వివరాల్లోకి వెళితే..
క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా తుపాకీలతో ఓ స్టార్ ఆల్ రౌండర్ ని బెదిరించారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
సాధారణంగా క్రికెటర్లు పర్యటనల నిమిత్తం పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో తమ బ్యాగులను, వస్తువులను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది క్యాజువల్ విషయమే. కానీ క్రికెటర్ల పై దుండగులు దాడి చేసి.. వారి వస్తువులను దోచుకెళ్లడమనేది చాలా అరుదుగా జరిగే సంఘటనలు. ఎందుకంటే? ప్లేయర్లు ఉండే హోటల్స్ దగ్గర భారీ బందోబస్తు ఉంటుంది. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవు. తాజాగా క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా తుపాకీలతో ఓ స్టార్ ఆల్ రౌండర్ ని బెదిరించారు.
క్రికెట్ ప్రపంచ ఉలిక్కిపడే సంఘన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ ను కొందరు దుండగులు తుపాకీలతో బెదిరించి.. అతడి దగ్గర ఉన్న ఫోన్, బ్యాగ్ తో పాటుగా మరికొన్ని వస్తువులను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫాబియన్ అలెన్ ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA20 2024లీగ్ లో పార్ల్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా.. సాండ్ టన్ సన్ హోటల్ దగ్గర ఫాబ్ అలెన్ పై కొందరు దుండగులు దాడి చేశారు. తుపాకీలతో అతడిని బెదిరించి కాస్ట్లీ ఫోన్ తో పాటుగా బ్యాగ్, మరికొన్ని ఇతర వస్తువులను దోచుకెళ్లారు.
ఈ సంఘటన అక్కడి క్రికెటర్లను షాక్ కు గురిచేసింది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ తో సహా పార్ల్ రాయల్స్ టీమ్ కూడా అంగీకరించినట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ పై ఇలాంటి దాడి జరగడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇది దేశానికే మంచి పరిణామం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని లీగ్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fabian Allen attacked and robbed at gunpoint at Paarl Royals’ team hotel in Johannesburg.
– Robbers snatched his phone and bag. (Cricbuzz). pic.twitter.com/ddpsJaSc2D
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024
ఇదికూడా చదవండి: Shubman Gill: ఇంజక్షన్లు తీసుకొని ఆడా.. సంచలన నిజాలు వెల్లడించిన గిల్!