Wankhede Stadium Road Ambulance Fans: వీడియో: వాంఖడే స్టేడియం రోడ్డులోకి అంబులెన్స్.. ఫ్యాన్స్​ను మెచ్చుకోకుండా ఉండలేరు!

వీడియో: వాంఖడే స్టేడియం రోడ్డులోకి అంబులెన్స్.. ఫ్యాన్స్​ను మెచ్చుకోకుండా ఉండలేరు!

Team India Parade: టీ20 వరల్డ్ కప్​తో స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ సేనకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రపంచ కప్ హీరోలను చూసేందుకు సుదూరాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకున్నారు.

Team India Parade: టీ20 వరల్డ్ కప్​తో స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ సేనకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రపంచ కప్ హీరోలను చూసేందుకు సుదూరాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకున్నారు.

టీ20 వరల్డ్ కప్​తో స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ సేనకు అపూర్వ స్వాగతం లభించింది. న్యూఢిల్లీ ఎయిర్​పోర్ట్​లో దిగినప్పటి నుంచి భారత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్లేయర్ల బస్సును ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యాక ప్రధాని నరేంద్ర మోడీతో కలసి బ్రేక్​ఫాస్ట్ చేశారు ఆటగాళ్లు. ఆ తర్వాత ముంబైకి బయల్దేరారు. ముంబైలో టీమిండియా ఫ్లైట్​ను అధికారులు వాటర్ సెల్యూట్​తో గౌరవించారు. ఆ తర్వాత ఆటగాళ్లు ఓపెన్ బస్​లోకి ఎక్కి విక్టరీ పరేడ్​గా వాంఖడే స్టేడియానికి బయల్దేరారు. ఈ క్రమంలో వాళ్లకు అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు.

ప్రపంచ కప్ హీరోలను చూసేందుకు సుదూరాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకున్నారు. దీంతో అక్కడి వీధులు, రోడ్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది ప్రజలు రావడంతో నగరం స్తంభించిపోయింది. రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. విక్టరీ పరేడ్ నేపథ్యంలో నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకు రోడ్లన్నీ ఫ్యాన్స్ కోలాహలంతో నిండిపోయాయి. దీంతో ఆ రూట్​లో వెహికిల్స్​ను పోలీసులు అనుమతించడం లేదు. అయితే, ఎమర్జెన్సీ కారణంగా అటు వైపుగా ఓ అంబులెన్స్ వచ్చింది. ట్రాఫిక్ కారణంగా అది చిక్కుకుపోయింది. అప్పటివరకు జై భారత్ అంటూ టీమిండియాను తలచుకొని నినదిస్తూ కోలాహలంలో మునిగిన వేలాది మంది ఆ అంబులెన్స్ చూడగానే సైలెంట్ అయిపోయారు.

అంబులెన్స్​ను చూసిన అభిమానులు బాధ్యతగా పక్కకు జరిగి దానికి దారినిచ్చారు. దీంతో ఆ వాహనం మెళ్లిగా అక్కడి నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా ఫ్యాన్స్ చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇది భారత ఫ్యాన్స్ అంటే.. ఇలా బాధ్యతగా నడుచుకోవడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఇక, టీమిండియా విక్టరీ పరేడ్ మొదలైపోయింది. రోహిత్, కోహ్లీ సహా ఆటగాళ్లతో నిండిన బస్సు వాంఖడే స్టేడియానికి బయల్దేరింది. దారి పొడవునా ఫ్యాన్స్​ వాళ్లకు అభినందనలు చెబుతున్నారు. టీమిండియా ఈజ్ గ్రేట్ అని నినదిస్తున్నారు. మరి.. అంబులెన్స్​కు అభిమానులు దారినిచ్చిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments