టీ20 వరల్డ్‌ కప్‌ ఎఫెక్ట్‌! సెలెక్షన్‌ కమిటీలో ఇద్దరిపై వేటు వేసిన PCB?

Wahab Riaza, Abdul Razzaq, PCB, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో చెత్త ప్రదర్శన తర్వాత.. పీసీబీ చర్యలు చేపట్టింది. తాజాగా సెలెక్షన్‌ కమిటీలో ఇద్దరి ఇంటికి పంపింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Wahab Riaza, Abdul Razzaq, PCB, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో చెత్త ప్రదర్శన తర్వాత.. పీసీబీ చర్యలు చేపట్టింది. తాజాగా సెలెక్షన్‌ కమిటీలో ఇద్దరి ఇంటికి పంపింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్ 2024లో పాకిస్థాన్‌ ఎంతటి దారుణమైన ప్రదర్శన కనబర్చిందో అందరికీ తెలిసిందే. కనీసం గ్రూప్‌ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది. గ్రూప్‌-ఏలో పాకిస్థాన్‌తో పాటు ఇండియా, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా జట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో పాక్‌ కంటే బలమైన జట్టు ఇండియా ఒక్కటే. దీంతో.. గ్రూప్‌-ఏ నుంచి ఇండియాతో పాటు పాకిస్థాన్‌ జట్టు సూపర్‌ 8కు వెళ్తుందని అంతా భావించారు. కానీ, చెత్త ఆటతో పాకిస్థాన్‌ పసికూన అమెరికా చేతిలో కూడా ఓడిపోయింది. దీంతో.. ఆ జట్టు కనీసం సూపర్‌ 8కు కూడా చేరకుండానే ఇంటి బాట పట్టింది.

ఈ దారుణ పరాభవాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత ఓటమికి కారణాలు విశ్లేషించుకుని.. ప్రక్షాళన చర్యలకు దిగింది. మొదటిగా.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం చెత్త టీమ్‌ను ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీపై కొరడా ఝుళిపించింది పీసీబీ. సెలెక్షన్‌ కమిటీ నుంచి ఇద్దరి తొలగించినట్లు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. సెలెక్షన్‌ కమిటీలో ఉన్న పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు వాహబ్‌ రియాజ్‌, అబ్దుల్‌ రజాక్‌లను బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం.

అబ్డుల్ రజాక్‌ టీ20 వరల్డ్‌ కప్‌ కంటే కొద్ది రోజుల ముందు మాత్రమే సెలెక్షన్‌ కమిటీలో చేరారు. ఆయనను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఏరికోరి నియమించింది. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌లో కనీసం పోరాటం చేయలేని జట్టును ఎంపిక చేసిన కారణంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇక జట్టు విషయంలో ఎలాంటి ప్రక్షాళన చేపడతారనే విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుషా కెప్టెన్సీ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ ఆజమ్‌ను తప్పించి.. మరో కొత్త ప్లేయర్‌కు కెప్టెన్సీ అప్పగిస్తారా? అనే విషయం క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌ చెత్త ప్రదర్శన కారణంగా సెలెక్టర్లపై వేటు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments