కోహ్లీని టార్చర్ చేస్తున్న ఫ్యాన్స్! ఇలా తయారయ్యారేంట్రా?

Virat Kohli, IND vs BAN: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడీ టాప్ బ్యాటర్.

Virat Kohli, IND vs BAN: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడీ టాప్ బ్యాటర్.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగినా అతడి నుంచి భారీ స్కోర్లు ఆశిస్తారు అభిమానులు. ఫ్యాన్సే కాదు.. ఆడియెన్స్, క్రికెట్ లవర్స్ కూడా కింగ్ తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడుతుంటే చూడాలని కోరుకుంటారు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండటంతో కోహ్లీ నుంచి అందరూ బడా ఇన్నింగ్స్ ఎక్స్​పెక్ట్ చేశారు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో అదరగొడతాడని భావించారు. అయితే చెన్నై టెస్ట్ రెండు ఇన్నింగ్స్​ల్లోనూ అతడు ఫెయిల్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్​లో 6 పరుగులు చేసిన విరాట్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 17 పరుగులతో మరోమారు నిరాశపర్చాడు. దీంతో అసలు విరాట్​కు ఏమైంది అంటూ కొందరు సీరియస్ అవుతున్నారు. ఈ టైమ్​లో అనూహ్యంగా ఫ్యాన్స్ నుంచి అతడిపై ప్రెజర్ పెరగడం, కొంతమంది అభిమానులు విరాట్​ను టార్చర్ చేయడం డిస్కషన్స్​కు దారితీసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో కోహ్లీ తక్కువ స్కోరుకు వెనుదిరిగాడు. 6 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే అతడు ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కొంతమంది అభిమానులు భారీగా శబ్దాలు చేశారట. విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ, అరుస్తూ గోల చేస్తూ సంబురాలు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్​ అని.. ఐపీఎల్​-2024లో ఆర్సీబీ చేతుల్లో ఓటమి కక్ష పెట్టుకొని కోహ్లీని ఇలా అవమానించారంటూ నెట్టింట కొన్ని పోస్టులు వెలువడ్డాయి. అప్పట్లో ఆర్సీబీ నెగ్గగానే భారీగా సంబురాలు చేసుకోవడంతో కోహ్లీ మీద పగ పెంచుకున్నారని, అందుకే చెన్నై టెస్ట్​లో సీఎస్​కే ఫ్యాన్స్ విరాట్​ను హేళన చేశారంటూ ఆ పోస్టుల్లో రాసుకొచ్చారు. అయితే అసలు నిజం ఇది కాదు. అభిమానులు గోల చేసింది కోహ్లీ ఔట్ అయ్యాడని కాదు.. రిషబ్ పంత్ బ్యాటింగ్​కు వస్తున్నందుకు అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది.

కారు ప్రమాదం కారణంగా రెండేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్​కు దూరమయ్యాడు పంత్. చాన్నాళ్లు ఆస్పత్రి మంచానికే పరిమితయ్యాడు. దీంతో అతడు ఆడడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ పట్టుదలతో లేచి ఫిట్​నెస్​ సాధించి తిరిగి టీమిండియాలోకి అడుగుపెట్టాడు పంత్. టీ20 వరల్డ్ కప్-2024ను రోహిత్ సేన గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అలాంటోడు ఫేవరెట్ ఫార్మాట్ టెస్టుల్లోకి ఈ మ్యాచ్​తోనే రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడు గ్రౌండ్​లోకి వస్తున్నప్పుడు ఫ్యాన్స్ అరుస్తూ, విజిల్స్ వేస్తూ అతడికి గ్రాండ్ వెల్​కమ్ చెప్పారని తెలుస్తోంది. అయితే అటు నుంచి కోహ్లీ ఔటై రావడం, ఇటు నుంచి పంత్ లోపలకు వెళ్లడంతో అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని మ్యాచ్​కు అటెండ్ అయిన కొందరు అభిమానులు అంటున్నారు. కోహ్లీని టార్చర్ చేశారనేది కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఐపీఎల్​ను, టీమిండియాను ఫ్యాన్స్ సెపరేట్​గా చూస్తారని.. భారత్​కు ఆడేటప్పుడు ప్రతి ప్లేయర్​ను గౌరవిస్తారని, నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని అంటున్నారు. మరి.. ఈ మొత్తం ఉదంతంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments