RCB vs LSG మ్యాచ్‌లో మిస్‌ అయిన అసలు యుద్ధం! జరిగి ఉంటే…?

Virat Kohli, Mayank Yadav, RCB vs LSG, IPL 2024: ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్‌ మధ్య కంటే.. కొంతమంది ఆటగాళ్ల మధ్య ఫైట్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ఆర్సీబీ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌లో ఓ యుద్ధం కోసం ఎదురుచూశారు. కానీ, అది మిస్‌ అయింది. ఆ యుద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Mayank Yadav, RCB vs LSG, IPL 2024: ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్‌ మధ్య కంటే.. కొంతమంది ఆటగాళ్ల మధ్య ఫైట్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ఆర్సీబీ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌లో ఓ యుద్ధం కోసం ఎదురుచూశారు. కానీ, అది మిస్‌ అయింది. ఆ యుద్ధం ఏంటో ఇప్పుడు చూద్దాం..

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. మంగళవారం తమ హోంగ్రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓడి.. ఈ సీజన్‌లో మూడో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అన్ని విభాగాల్లో ఆర్సీబీపై ఆధిపత్యం చెలాయించి.. డామినేటింగ్‌ విక్టరీని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి.. 181 పరుగుల మంచి స్కోర్‌ చేసిన లక్నో.. తర్వాత ఆర్సీబీని కేవలం 153 పరుగులకే కట్టడి చేసింది. లక్నో విజయంలో ఆ జట్టు యువ స్టార్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ కీ రోల్‌ ప్లే చేశాడు. రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కామెరున్‌ గ్రీన్‌లను అవుట్‌ చేసి.. అదరగొట్టాడు.

ముఖ్యంగా అతని స్పీడ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో 155.8 కిలో మీటర్ల వేగంతో బంతి విసిరి ఔరా అనిపించాడు. మళ్లీ వెంటనే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అంతకు ముంచిన వేగంతో 156.7 కిమీతో బాల్‌ వేసి.. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా బాల్‌ వేసిన తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీ ఆటగాడు కామెరున్‌ గ్రీన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బాల్‌ అయితే.. మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ యాదవ్‌ను ఎదుర్కొకపోవడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురవుతున్నారు.

నిజానికి ఆర్సీబీ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ అనగానే చాలా మంది కోహ్లీ వర్సెస్‌ మయాంక్‌ ఫైట్‌ చూడొచ్చని భావించారు. కానీ, విరాట్‌ బ్యాటింగ్‌కి దిగిన సమయంలో రెండు వైపుల నుంచి స్పిన్నర్లతో ఎటాక్‌ చేయించడం, 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసిన తర్వాత ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ రెండో బంతికి కోహ్లీ అవుట్‌ కావడంతో మయాంక్‌ వర్సెస్‌ కోహ్లీ ఫైట్‌ మిస్‌ అయింది. ఒక వేళ మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ చేసి ఉంటే.. బెస్ట్‌ వర్సెస్‌ బీస్ట్‌ ఫైట్‌ చేసేందుకు ఉండేది. కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్‌కు బౌలింగ్‌ వేసి.. మంచి ఫలితం రాబడితే.. మయాంక్‌ సత్తా ఏంటో కూడా మరింత తెలిసేది అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి మీరు కూడా కోహ్లీ వర్సెస్‌ మయాంక్‌ ఫైట్‌ను మిస్‌ అయ్యారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments