iDreamPost
android-app
ios-app

IND vs NEP: నేపాలీ అభిమానికి విరాట్ కోహ్లీ పలకరింపు!

  • Author Soma Sekhar Published - 06:06 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 06:06 PM, Mon - 4 September 23
IND vs NEP: నేపాలీ అభిమానికి విరాట్ కోహ్లీ పలకరింపు!

ఆసియా కప్ లో భాగంగా పసికూన నేపాల్ తో కీలక మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. పాక్ తో తలపడ్డ తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఈ దశలో నేపాల్ పై భారీ విజయం సాధించి సూపర్ 4 కు వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. నేపాల్ ఓపెనర్లు ఇద్దరు టీమిండియా బౌలర్లను ఎదుర్కొంటూ.. వారికి లభించిన జీవనాధారాన్ని సద్వినియోగం చేసుకుని తొలి వికెట్ కు అర్దశతకం భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నేపాలీ క్రికెట్ అభిమానులతో కలిసి హంగామా చేశాడు. వారి అభిమానానికి ఫిదా అయిన విరాట్.. వారితో కలిసి నవ్వులు పూయించాడు.

విరాట్ కోహ్లీ.. శత్రువు కూడా ఇతడి ఆటకు అభిమాని కావాల్సిందే. అలా ఉంటుంది విరాట్ ఆట మరి. విరాట్ కోహ్లీ ఆటకు ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. పాక్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడు త్వరగా అవుట్ కావడంతో.. పాక్ యువతి కన్నీరు కూడా పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా.. విరాట్ కోహ్లీకి నేపాల్ లో సైతం అభిమానులు ఉన్నారు. తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఓ లేడీ అభిమానితో కలిసి హంగామా సృష్టించాడు విరాట్ భాయ్. దీంతో నేపాలీ ఫ్యాన్స్ విరాట్ తో కలిసి ఎంజాయ్ చేశారు.

కాగా.. విరాట్ కు ఫ్యాన్స్ ను ఎలా ఎంటర్ టైన్ చేయాలో తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అదీకాక నేపాలీ నటి బర్షా శివకోటి తనకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక విరాట్ గ్రౌండ్ లో తనదైన రీతిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం విరాట్ నేపాల్ ఫ్యాన్స్ తో కలిసి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి