Virat Kohli: కోహ్లీని భయపెట్టిన నెట్ బౌలర్! ఎవరీ గుర్నూర్ బ్రార్?

Virat Kohli Troubled By Gurnoor Brar In Nets: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి ప్రత్యర్థి బౌలర్లు జడుసుకుంటారు. అతడితో పెట్టుకోవాలంటేనే వణికిపోతారు. అలాంటి కోహ్లీని ఓ నెట్ బౌలర్ భయపెట్టాడట. ఎవరా బౌలర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli Troubled By Gurnoor Brar In Nets: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి ప్రత్యర్థి బౌలర్లు జడుసుకుంటారు. అతడితో పెట్టుకోవాలంటేనే వణికిపోతారు. అలాంటి కోహ్లీని ఓ నెట్ బౌలర్ భయపెట్టాడట. ఎవరా బౌలర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి ప్రత్యర్థి బౌలర్లు జడుసుకుంటారు. అతడితో పెట్టుకోవాలంటేనే వణికిపోతారు. వికెట్ మాట దేవుడెరుగు.. అతడికి డాట్ బాల్ వేస్తే అదే గొప్ప అని అనుకుంటారు. బౌండరీలు, సిక్సులతో ఎక్కడ తమ మీద విరుచుకుపడతాడోనని భయపడతారు. కింగ్​తో పెట్టుకుంటే కెరీర్ ఫినిష్ అవుతుందని టెన్షన్ పడతారు. విరాట్​కు బౌలింగ్​ చేయడానికి టాప్ బౌలర్లు కూడా వెనకడుగు వేస్తారు. అలాంటిది ఓ నెట్ బౌలర్ కోహ్లీని భయపెట్టాడట. భీకరమైన బౌన్సర్లతో కింగ్​ను షేక్ చేశాడట. అతడి బౌలింగ్​లో ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. అంతగా కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఆ బౌలర్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ప్రిపేర్ అవుతోంది. అందరు ఆటగాళ్లు నెట్స్​లో చెమటోడ్చుతున్నారు. చాన్నాళ్ల తర్వాత టెస్టులు ఆడుతున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రాక్టీస్​ సెషన్​లో బ్యాట్​తో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాతో పాటు నెట్ బౌలర్ గుర్నూర్ బ్రార్​ను ఎదుర్కొన్నాడట. వాళ్ల బౌలింగ్​లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడట. అయితే బుమ్రా బంతులకు కాస్త తడబడిన విరాట్.. గుర్నూర్ బౌలింగ్​లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డాడట. 6.5 అడుగులు ఉండే బ్రార్.. తన హైట్​ను వాడుకొని బౌన్సర్లతో కోహ్లీని టెస్ట్ చేశాడట. వేగంగా వస్తున్న ఎక్స్​ట్రా బౌన్స్​ డెలివరీస్​ ఫేస్ చేయడంలో టాప్ బ్యాటర్ ఇబ్బంది పడ్డాడట. ఫ్రంట్ ఫుట్​లో ఆడబోయి ఫెయిల్ అయ్యాడని తెలుస్తోంది. దీంతో బ్రార్ ఎవరంటూ అతడి గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు.

పంజాబ్​కు చెందిన గుర్నూర్ బ్రార్ పెద్ద తోపు బౌలరేం కాదు. డొమెస్టిక్ క్రికెట్​లో అతడి రికార్డులు అంత గొప్పగా ఏమీ లేవు. ఇప్పటిదాకా 5 లిస్ట్ ఏ మ్యాచులతో పాటు ఐదు టీ20 మ్యాచులు ఆడాడు బ్రార్. ఐపీఎల్​లో పంజాబ్ కింగ్స్​కు ఆడుతున్న ఈ ఆజానుబాహుడు.. ఐపీఎల్​-2023లో లక్నో సూపర్​ జియాంట్స్​తో జరిగిన మ్యాచ్​తో డెబ్యూ ఇచ్చాడు. ఆ మ్యాచ్​లో మూడు ఓవర్లు వేసి 42 రన్స్ ఇచ్చాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. లిస్ట్-ఏలో 7 వికెట్లు తీసిన బ్రార్​ను టీమిండియా నెట్ సెషన్​కు ఎంపిక చేయడానికి ఓ రీజన్ ఉంది. ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​లో బంగ్లాదేశ్ నయా పేసర్ నహిద్ రాణా అదరగొట్టాడు. క్వాలిటీ పేస్​తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాణాతో ముప్పును గ్రహించిన బీసీసీఐ.. అతడ్ని పోలిన పొడుగాటి బౌలర్ కోసం వెతికింది. రాణా మాదిరిగా బౌలింగ్ చేసే బ్రార్​ను నెట్ బౌలర్​గా ఎంపిక చేసింది. డొమెస్టిక్ క్రికెట్​లో గొప్పగా రికార్డులు లేకపోయినా కోహ్లీని భయపెట్టడంలో అతడు సక్సెస్ అవడం గమనార్హం. మరి.. విరాట్​ను నెట్ బౌలర్​ భయపెట్టడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments