Virat Kohli: విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆ స్టార్లను వెనక్కినెట్టి మరి..

విరాట్ కు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయంలో ఆ బాలీవుడ్ స్టార్లను వెనక్కినెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయంలో ఆ బాలీవుడ్ స్టార్లను వెనక్కినెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరుతో వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. తన పేరిట ఎన్నో ఘనతలను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో పరుగుల వరదపారించి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా నిలిచాడు. ఇదిలా ఉండగా.. విరాట్ కు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయంలో ఆ బాలీవుడ్ స్టార్లను వెనక్కినెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ నివేదిక(KROLL) ప్రకారం.. విరాట్ బ్రాండ్ వాల్యూ 2023లో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే.. ఇది 29 శాతం పెరిగింది. ఇక జాబితాలో బాలీవుడ్ స్టార్లు రణ్ వీర్ సింగ్(రూ. 1693 కోట్లు),  షారుఖ్ ఖాన్(రూ. 1001 కోట్ల)తో తర్వాత స్థానాల్లో ఉన్నారు. దాంతో వీరిద్దరిని వెనక్కినెట్టి కింగ్ కోహ్లీ టాప్ లోకి దూసుకొచ్చాడు.

కాగా.. 2022లో విరాట్ ఈ జాబితాలో రెండో ప్లేస్ లో నిలిచాడు. అయితే 2017 నుంచి(ఒక్క 2022లో తప్ప) వరుసగా ఆరుసార్లు భారతదేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా మెుదటి ప్లేస్ లో నిలిచాడు విరాట్. ఇదిలా ఉండగా.. క్రికెట్ కు సంబంధించి కూడా మోస్ట్ వాల్యూ సెలబ్రిటీల లిస్ట్ లో కోహ్లీనే టాప్ లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్ ఉన్నారు.

ఇక.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో పరుగుల సునామీ సృష్టించిన విరాట్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ టోర్నీలో ఓపెనర్ గా బరిలోకి దిగి.. ఆడిన మూడు మ్యాచ్ ల్లోకేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. సూపర్ 8 మ్యాచ్ ల్లో అయినా రాణించాలని ఫ్యాన్స్ తో పాటుగా మేనేజ్ మెంట్ కూడా కోరుకుంటోంది. మరి బాలీవుడ్ స్టార్లను వెనక్కి నెట్టి అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments