Virat Kohli: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సెన్సేషనల్ కామెంట్స్.. కోహ్లీ తనపై ఉమ్మేశాడంటూ..!

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇష్టపడని వారుండరు. చాలా మంది సహచర క్రికెటర్లు కూడా అతడే తమ ఫేవరెట్ అని అంటుంటారు. అలాంటి కింగ్ కోహ్లీపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇష్టపడని వారుండరు. చాలా మంది సహచర క్రికెటర్లు కూడా అతడే తమ ఫేవరెట్ అని అంటుంటారు. అలాంటి కింగ్ కోహ్లీపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇష్టపడని వారుండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన బ్యాటింగ్ టాలెంట్​తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడీ స్టార్ ప్లేయర్. కోహ్లీ బ్యాటింగ్, ఫిట్​నెస్​ లెవల్స్, అతడి ఎనర్జీ, స్టైల్, యాటిట్యూడ్​ను అందరూ ఇష్టపడతారు. సిచ్యువేషన్ ఎంత క్లిష్టంగా ఉన్నా సరే విరాట్ క్రీజులో ఉన్నాడంటే భారత్ గెలుపు పక్కా అనే ధీమా అందరిలోనూ ఉంటుంది. 15 ఏళ్లుగా కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్న ఈ స్టార్ బ్యాటర్​కు రికార్డులు సలామ్ కొడుతున్నాయి. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేసిన విరాట్.. ఇదే ఫామ్​తో మరో నాలుగేళ్లు ఆడితే అన్ని గ్రేట్ రికార్డులను చెరిపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్రికెట్​కు బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు కింగ్. అలాంటోడి మీద సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తన మీద ఉమ్మేశాడని అన్నాడు.

టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్​లో కోహ్లీ తన మీద ఉమ్మేశాడని ఎల్గర్ చెప్పాడు. అతడు తనను తిట్టాడని.. తాను కూడా తన భాషలో అభ్యంతకర పదం వాడి బ్యాట్​తో కొడతానన్నానని తెలిపాడు. అయితే తర్వాత రెండేళ్లకు సారీ చెప్పాడని ఓ పాడ్​కాస్ట్​లో చెప్పుకొచ్చాడు ఎల్గర్. ‘2015లో టెస్ట్ సిరీస్​లో ఆడేందుకు భారత్​కు వచ్చా. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్​ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఆ టైమ్​లో కోహ్లీ నా మీద ఉమ్మేశాడు. దీంతో నా భాషలో అభ్యంతరకర పదం వాడి బ్యాట్​తో కొడతానని హెచ్చరించా’ అని ఎల్గర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్​తో కలసి ఆడతాడు కాబట్టి తన భాషలో చెప్పిన ఆ పదం అర్థం ఏంటో విరాట్​కు తెలుసునన్నాడు ఎల్గర్. అయితే కోహ్లీకి తనకు మధ్య జరిగిన ఘటన గురించి డివిలియర్స్​కు తెలిసిందన్నాడు. దీంతో ఈ విషయం గురించి విరాట్​తో ఏబీడీ డిస్కస్ చేశాడని పేర్కొన్నాడు.

‘కోహ్లీకి నాకు మధ్య జరిగిన ఘటన గురించి డివిలియర్స్​కు తెలిసింది. నా టీమ్​మేట్ మీద అలా ఎందుకు ఉమ్మివేశావని విరాట్​ను ఏబీడీ ప్రశ్నించాడు. ఆ తర్వాత రెండేళ్లకు భారత జట్టు మా దేశంలో ఆడేందుకు వచ్చింది. అప్పుడు విరాట్​ నన్ను కలిశాడు. సిరీస్ ముగిసిన తర్వాత డ్రింక్​ చేద్దామా అని అడిగాడు. అక్కడ నాకు సారీ చెప్పాడు. తాను చేసిన దానికి క్షమించాలని కోరాడు. దీంతో ఆ గొడవ అక్కడే ముగిసింది. ఆ రోజు ఉదయం 3 గంటల దాకా మేం తాగుతూనే ఉన్నాం. అప్పట్లో అతడు డ్రింక్ చేసేవాడు. కానీ ఆ తర్వాత మానేశాడు. ఇప్పుడు కోహ్లీ మారిపోయాడు’ అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల సఫారీ టూర్​లో టెస్టు సిరీస్​లో ఎల్గర్ ఔట్ అయినప్పుడు కోహ్లీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ సిరీస్ అతడికి చివరిది కావడంతో విరాట్ గౌరవ సూచకంగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అలాగే తన టెస్ట్ జెర్సీని ఎల్గర్​కు గిఫ్ట్​గా ఇచ్చాడు. మరి.. కోహ్లీపై ఎల్గర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments