iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీపై స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ సాంగ్.. కింగ్​ ఘనతల్ని ఒకే పాటలో..!

  • Published Mar 20, 2024 | 12:31 PM Updated Updated Mar 20, 2024 | 12:31 PM

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ కొత్త సాంగ్ వచ్చేసింది. అతడు సాధించిన ఘనతల్ని ఒకే పాటలో తీసుకొచ్చి అభిమానులకు సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ కొత్త సాంగ్ వచ్చేసింది. అతడు సాధించిన ఘనతల్ని ఒకే పాటలో తీసుకొచ్చి అభిమానులకు సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

  • Published Mar 20, 2024 | 12:31 PMUpdated Mar 20, 2024 | 12:31 PM
వీడియో: కోహ్లీపై స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ సాంగ్.. కింగ్​ ఘనతల్ని ఒకే పాటలో..!

ఐపీఎల్-2024 కౌంట్​డౌన్ పూర్తి కావొస్తోంది. మరో రెండ్రోజుల్లో పొట్టి లీగ్ జాతర మొదలుకానుంది. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ కోసం అన్ని జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. వారం రోజుల ముందు నుంచే ఆయా టీమ్స్ ప్లేయర్లు ఒక్క చోట చేరి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ప్రతిష్టాత్మక ఐపీఎల్ కప్పును ఎగరేసుకోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. 16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టైటిల్​ను సొంతం చేసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా భావిస్తోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్​లో తమ ఫ్రాంచైజీ ఛాంపియన్​గా నిలవడంతో అదే జోరును పురుషుల జట్టు కూడా కొనసాగించాలని కోరుకుంటోంది. ఈ తరుణంలో ఆర్సీబీ ఫ్యాన్స్​కు మరింత కిక్ ఇస్తూ ఐపీఎల్ బ్రాడ్​కాస్టర్స్ ఓ స్పెషల్ సాంగ్​ను రిలీజ్ చేశారు.

బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద రూపొందిన ప్రత్యేకమైన గీతాన్ని స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. కింగ్ సాధించిన ఘనతలను ఈ పాటలో చేర్చారు. ‘ఓయ్ స్వీట్ గిరా సైలాబ్ ఉఠా.. తేరా హస్ల్ కా రస్తా హే’ అంటూ ఈ పాట మొదలవుతుంది. నిమిషం 39 సెకన్ల పాటు సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనను తానే ఛాలెంజ్ చేసుకునే కోహ్లీ లాంటోడు మరొకడు లేడంటూ సాగే ఈ పాట అందర్నీ ఊపేస్తోంది. సాంగ్ మొత్తంలో ఎక్కువగా వినిపించే ‘కోహ్లీ కాలింగ్.. గో కింగ్ గో కింగ్’ అనే లిరిక్స్​ వింటే గూస్​బంప్స్ రావడం గ్యారెంటీ. ఈ పాటను ఆర్సీబీ ఫ్యాన్స్​ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. దీని మీద నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

కోహ్లీపై రూపొందిన స్పెషల్ సాంగ్ సూపర్బ్​గా ఉందని నెటిజన్స్ అంటున్నారు. విరాట్ ఆటతీరు, సవాళ్లను అతడు ఎదుర్కొనే విధానం, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడే పద్ధతిని సాంగ్​లో చాలా బాగా ఎక్స్​ప్లెయిన్ చేశారని మెచ్చుకుంటున్నారు. ఇక, భార్య అనుష్క శర్మ డెలివరీ వల్ల చాన్నాళ్లు లండన్​లోనే ఉండిపోయాడు కింగ్. కొడుకు పుట్టాక కూడా వెంటనే ఇండియాకు రాలేదు. దీంతో ఐపీఎల్-2024 అతడు ఆడతాడా? లేదా? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్​గా బెంగళూరులో అడుగుపెట్టాడు విరాట్. మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ అన్​బాక్స్ ఈవెంట్​లోనూ మెరిశాడు. కొత్త హెయిర్ స్టైల్​తో అందర్నీ అట్రాక్ట్ చేశాడు. మరి.. కోహ్లీపై రూపొందిన ఈ స్పెషల్ సాంగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: SIగా ఎదిగిన గంగూలీ అభిమాని కథ! ఇంత అభిమానం ఏంటి బ్రో?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet