Virat Kohli Should Play Says Mohammad Irfan: కోహ్లీ లేకుండా ఆడటం ఏంటి? పాక్ మాజీ క్రికెటర్ ప్రశ్న!

కోహ్లీ లేకుండా ఆడటం ఏంటి? పాక్ మాజీ క్రికెటర్ ప్రశ్న!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆసక్తికరమైన ప్రశ్న సంధించాడు. కోహ్లీ లేకుండా ఆడటం ఏంటని క్వశ్చన్ చేశాడు. ఆయన ఎందుకా ప్రశ్న వేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆసక్తికరమైన ప్రశ్న సంధించాడు. కోహ్లీ లేకుండా ఆడటం ఏంటని క్వశ్చన్ చేశాడు. ఆయన ఎందుకా ప్రశ్న వేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఏడాది జూన్​లో మొదలయ్యే ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్-2024​లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడటం లేదంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యంగ్ క్రికెటర్స్​కు ఛాన్సులు ఇచ్చేందుకు అతడు పొట్టి ఫార్మాట్​ నుంచి వైదొలగాలని డిసైడ్ అయ్యాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్​ కూడా కోహ్లీతో మాట్లాడాడని కథనాలు వచ్చాయి. ఐపీఎల్-2024లో విరాట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అతడి ఫ్యూచర్ తేలనుందనే న్యూస్ కూడా వచ్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ లేని టీమిండియాను ఊహించలేమన్నాడు. అసలు విరాట్ లేకుండా ఆడటం ఏంటని ఎదురు ప్రశ్న వేశాడు.

ప్రత్యర్థుల నుంచి సింగిల్ హ్యాండ్​తో మ్యాచులను లాగేసుకొని భారత్​ను గెలిపించే సత్తా కోహ్లీకి మాత్రమే ఉందన్నాడు మహ్మద్ ఇర్ఫాన్. ‘విరాట్ కోహ్లీ లేకుండా భారత తుదిజట్టును ఊహించలేం. టీమ్ కాంబినేషన్​లో అతడు ఉండాల్సిందే. ఇందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. అతడు ఎంత తోపు బ్యాటరో అందరికీ తెలిసిందే. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లోనూ కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసాన్ని అందరం ఎంజాయ్ చేశాం. ఆ టోర్నీలో 3 నుంచి 4 మ్యాచులు కేవలం కోహ్లీ వల్లే టీమిండియా నెగ్గింది. మెగాటోర్నీలో టఫ్ సిచ్యువేషన్స్​లో అతడు గనుక అలా నిలబడి ఆడకపోయి ఉంటే రోహిత్ సేన మూడ్నాలుగు మ్యాచుల్లో ఓడిపోయేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచుల్లో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచుల్ని కోహ్లీ సింగిల్ హ్యాండ్​తో ఫినిష్ చేశాడు’ అని మహ్మద్ ఇర్ఫాన్ గుర్తుచేశాడు.

ఒంటిచేత్తో ఎన్నో మ్యాచుల్లో జట్టును గెలిపించిన కోహ్లీ గురించి ఇలాంటి పుకార్లు రావడం కరెక్ట్ కాదని ఇర్ఫాన్ అసహనం వ్యక్తం చేశాడు. టీమ్​లో అతడి స్థానం గురించి అనుమానాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని.. కోహ్లీ లేకుండా భారత్ ఆడబోదని స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్​లో విరాట్ ఆడటం డౌటే, అతడికి ప్లేస్ దక్కదంటూ కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్లది గల్లీ క్రికెట్​ స్థాయి మనస్తత్వం అని ఇర్ఫాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్​లో స్ట్రయిక్ రేట్ కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. ‘టీ20ల్లో స్ట్రయిక్ రేట్​ చాలా ముఖ్యం. డాట్ బాల్స్ పెరిగే కొద్దీ ఒత్తిడి ఎక్కువవుతుంది. 10 బంతుల్లో 30 పరుగులు చేసే బ్యాటర్లు ఉంటే ప్రెజర్ తగ్గుతుంది. కోహ్లీలా బాల్​కో రన్ చొప్పున పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్లకు అదో పెద్ద సవాల్​గా మారుతుంది’ అని ఇర్ఫాన్ వివరించాడు. మరి.. భారత జట్టులో కోహ్లీ స్థానం గురించి అనుమానాలు వద్దంటూ పాక్ క్రికెటర్ ఇర్ఫాన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments