పాత కోహ్లీ అయితేనే న్యూయార్క్‌ పిచ్‌పై ఆడగలడు: మాజీ క్రికెటర్‌

Virat Kohli, T20 World Cup 2024, Sanjay Manjrekar: విరాట్‌ కోహ్లీపై మరోసారి ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ విమర్శలు గుప్పించాడు. దానిపై కోహ్లీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరు? ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, T20 World Cup 2024, Sanjay Manjrekar: విరాట్‌ కోహ్లీపై మరోసారి ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ విమర్శలు గుప్పించాడు. దానిపై కోహ్లీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరు? ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇప్పటి వరకు పెద్ద స్కోర్‌ చేయలేదు. ఆడింది రెండు మ్యాచ్‌లే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ, రెండు మ్యాచ్‌లు కూడా పెద్ద టీమ్స్‌ జరగలేదు. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ లాంటి టీమ్స్‌తో కూడా కోహ్లీ 1, 4 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఏ విరాట్‌ కోహ్లీ అభిమానే కాదు, సగటు క్రికెట్‌ అభిమాని కూడా కోహ్లీ నుంచి లాంటి ప్రదర్శనను ఆశించడు. సో.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో కోహ్లీ తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అయితే.. న్యూయార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉండటంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని క్రికెట్ నిపుణులు అంటున్నారు. కానీ, కోహ్లీ ఒక్క మార్పు చేసుకుంటే.. న్యూయార్క్‌ పిచ్‌పై రాణిస్తాడని భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. ఇంతకీ కోహ్లీ ఏం మార్చుకోవాలి, అతనికి ఉన్న సమస్య ఇది అని మంజ్రేకర్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు దాదాపు గత రెండు ఏళ్లుగా విరాట్‌ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి. కానీ, ఐపీఎల్‌ 2024లో కోహ్లీ తన స్ట్రైక్‌రేట్‌ను మెరుగు పర్చుకున్నాడు. 150 స్ట్రేక్‌రేట్‌తో ఆడాడు. కానీ మిగతా వాళ్లు 200 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు అది వేరే విషయం అనుకోండి. అయితే.. వేగంగా ఆడాలనే మైండ్‌సెట్‌తో కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌లోకి అడుగుపెట్టి.. అదే పంథంలో ఆడుతూ విఫలం అవుతున్నాడు. న్యూయార్క్‌ లాంటి ట్రిక్కి పిచ్‌పై పాత కోహ్లీ.. అంటే స్ట్రైక్‌రేట్‌ను పట్టించుకోకుండా మ్యాచ్‌, పిచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడే కోహ్లీని బయటికి తీస్తే బాగా ఆడతాడు’ అంటూ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. అతను చేసిన ఈ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.

కోహ్లీపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తూ.. మంజ్రేకర్‌ వార్తల్లో నిలవాలని చూస్తున్నాడని, అసలు కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ విషయంపై ఇప్పుడు చర్చదేనికని.. కోహ్లీ ఆడింది రెండే మ్యాచ్‌లని అప్పుడే మళ్లీ కోహ్లీపై పడ్డావా అంటూ మంజ్రేకర్‌ను తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్‌. ఐపీఎల్‌ 2024లో కోహ్లీ కంటే చాలా తక్కువ మంది మాత్రమే మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో ఆడారని, హేమాహేమీ ప్లేయరంతా కోహ్లీ కంటే తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారని, వారిలో కొంతమంది అసలు పరుగులే చేయకుండా దారుణంగా విఫలం అయ్యారని, అయినా.. ఈ చిన్న చిన్న టీమ్స్‌పై కాదు.. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్‌తో మ్యాచ్‌లు వచ్చిన సమయంలో కోహ్లీ విలువ తెలుస్తుంది అంటూ మంజ్రేకర్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. మరి కోహ్లీపై మంజ్రేకర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments