iDreamPost
android-app
ios-app

RCB vs PBKS: ప్రీతి జింతాకు సారీ చెప్పిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?

  • Published May 10, 2024 | 1:18 PM Updated Updated May 10, 2024 | 1:18 PM

పంజాబ్ కింగ్స్ ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతాకు మ్యాచ్ అనంతరం సారీ చెప్పాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఆమెకు కోహ్లీ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఆ వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కింగ్స్ ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతాకు మ్యాచ్ అనంతరం సారీ చెప్పాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఆమెకు కోహ్లీ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఆ వివరాల్లోకి వెళితే..

  • Published May 10, 2024 | 1:18 PMUpdated May 10, 2024 | 1:18 PM
RCB vs PBKS: ప్రీతి జింతాకు సారీ చెప్పిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?

IPL 2024 సీజన్ లో మరొక్క మ్యాచ్ ఓడిపోతే.. ఇంటికి వెళ్లే పరిస్థితి నుంచి వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆర్సీబీ జట్టు. విరాట్ కోహ్లీ శివతాండవం ఎత్తడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పంజాబ్ 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పంజాబ్ ఓనర్ ప్రీతీ జింతాకు విరాట్ కోహ్లీ సారీ చెప్పాడు.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 92 పరుగులతో సత్తాచాటాడు. ఫీల్డింగ్ లో సైతం మెరుపు వేగంతో దూకుడుగా ఆడుతున్న శశాంక్ సింగ్ ను రనౌట్ చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ను దక్కించుకున్నాడు విరాట్. అయితే ఈ బహుమతి పంజాబ్ ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా చేతుల మీదుగా తీసుకున్నాడు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అవార్డు తీసుకునే క్రమంలో ప్రీతీ జింతాకు సారీ చెప్పాడు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. అయితే తాను ఆమెకు ఎందుకు సారీ చెప్పాడో మాత్రం వివరించలేదు. బహుశా ప్రీతీ జింతా లాంటి అందమైన అమ్మాయి టీమ్ ను ఓడించినందుకు సారీ చెప్పి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీనే.. అందుకే ఆమెకు సారీ చెప్పాడు. మరి ప్రీతీ జింతాకు కోహ్లీ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş