ధోని కాదు.. బౌలర్లకు అసలైన పీడకల ఆ బ్యాటరే: కోహ్లీ

  • Author singhj Published - 11:19 AM, Thu - 14 September 23
  • Author singhj Published - 11:19 AM, Thu - 14 September 23
ధోని కాదు.. బౌలర్లకు అసలైన పీడకల ఆ బ్యాటరే: కోహ్లీ

ప్రపంచ క్రికెట్​లో ఎంతో మంది గొప్ప బ్యాట్స్​మెన్​ను చూసుంటారు. కానీ నిలకడగా రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేవారు మాత్రం తక్కువే. ఏళ్ల తరబడి ఫామ్​ను కొనసాగిస్తూ, గాయాల బారిన పడకుండా ఉండటం, ఒత్తిడిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం అంటే మాటలు కాదు. దీని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, సాధన, క్రమశిక్షణ ఉండాలి. అయితే ఇది సాధ్యమేనని నిరూపించాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. దాదాపుగా 15 ఏళ్లుగా అలుపెరగకుండా ఆడుతూ పోతున్నాడీ బ్యాటర్. విరాట్ గ్రౌండ్​లోకి దిగాడంటే పరుగుల వర్షం కురవాల్సిందే. టెస్టు, వన్డే, టీ20 అనే తేడాలు అతడికి ఉండవు. ఏ బౌలర్ వేస్తున్నాడు, ఎలాంటి పిచ్​లో ఆడుతున్నాడో అతడు పట్టించుకోడు.

బ్యాట్​ అనే మంత్రదండంతో మ్యాజిక్ చేయడం విరాట్​కు అలవాటుగా మారింది. అందుకే సెంచరీల మీద సెంచరీలు కొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసుకున్న కోహ్లీ.. మరికొన్నేళ్లు ఇలాగే ఆడితే దాదాపుగా అన్ని రికార్డులు అతడి పేరు మీదకు వచ్చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ప్రస్తుత తరంలో క్రికెట్​లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే అందరూ విరాట్ పేరే చెబుతారు. కానీ అలాంటి కోహ్లీ మాత్రం ఒక బ్యాట్స్​మన్ అందరికంటే డేంజరస్ అంటున్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​​తో ఒకసారి ఆసక్తికర సంభాషణలో భాగంగా ఈ విషయాన్ని చెప్పాడట విరాట్.

డెత్ ఓవర్లలో కెప్టెన్లకు పీడకల లాంటి బ్యాటర్ ఎవరో తెలుసా? అని అశ్విన్​ను అడిగాడట కోహ్లీ. దీనికి ధోని అని తాను జవాబు చెప్పానన్నాడు అశ్విన్. అయితే కోహ్లీ మాత్రం ధోని కాదు.. రోహిత్ శర్మ అన్నాడట. ‘డెత్ ఓవర్లలో ధోని కంటే రోహిత్ చాలా డేంజర్. టీ20ల్లో 16వ ఓవర్ తర్వాత రోహిత్ క్రీజులో ఉంటే ఎక్కడ బాల్ వేయాలో అర్థం కాదు. అతడి వద్ద అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియంలో హిట్​మ్యాన్ ఇన్నింగ్స్​ను కోహ్లీ ఎప్పటికీ మర్చిపోడు’ అని ప్రశంసలు కురిపించాడు అశ్విన్. మరి.. డెత్ ఓవర్లలో కోహ్లీ, రోహిత్, ధోని.. ఈ ముగ్గురిలో ఎవరు డేంజరస్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మ్యాంగో మ్యాన్ నవీన్​కు గోల్డెన్ ఛాన్స్!

Show comments