బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క ఆలోచనే నా మైండ్​లో ఉంది: కోహ్లీ

  • Author singhj Published - 11:04 AM, Tue - 12 September 23
  • Author singhj Published - 11:04 AM, Tue - 12 September 23
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క ఆలోచనే నా మైండ్​లో ఉంది: కోహ్లీ

ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో జరిగిన సూపర్-4 మ్యాచ్​లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. దాయాదిపై అన్ని విభాగాల్లోనూ రాణించి వరల్డ్ కప్ ముంగిట తన సత్తా ఏంటో చాటింది. ఏకంగా 228 రన్స్ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్​మన్ గిల్ (58)​తో పాటు కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో ఇన్నింగ్స్​కు మంచి పునాది వేయగా.. కోహ్లీ (122 నాటౌట్), రాహుల్ (111 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కి టీమిండియాకు భారీ స్కోరును అందించారు. భారత ఇన్నింగ్స్​లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్పెషల్ అనే చెప్పాలి.

హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన విరాట్.. ఆ తర్వాత జూలు విదిల్చాడు. ఈ సెంచరీతో వన్డేల్లో కోహ్లీ శతకాల సంఖ్య 47కు చేరింది. సచిన్ పేరు మీద ఉన్న అత్యధిక శతకాల రికార్డు (49)కు విరాట్ మరింత చేరువయ్యాడు. ఇది కొలంబో స్టేడియంలో కోహ్లీకి వరుసగా నాలుగో ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. పాక్​తో మ్యాచ్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన మైండ్​లో ఒకే విషయం ఉందన్నాడు కోహ్లీ. మంగళవారం నాడు శ్రీలంకతో మ్యాచ్ జరగాల్సి ఉందని.. దాని గురించే తాను ఆలోచిస్తూ ఉన్నానని విరాట్ తెలిపాడు. తాను టీమ్​కు సాయపడేందుకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటానన్నాడు.

కేఎల్ రాహుల్ ఇవాళ గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం స్రైక్ రొటేట్ చేయడమే నా పని. రన్స్ ఈజీగా రాబట్టడం సంతోషంగా ఉంది. నేను కొట్టిన రివర్స్ ర్యాంప్ షాట్​పై నాకు గౌరవం ఉంది. సెంచరీ దాటిన తర్వాత ఆ షాట్ కొట్టా. రాహుల్​తో నా భాగస్వామ్యం గొప్పది. ఇది భారత్​కు మంచి సంకేతం. ఈ విధంగా అతడు వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించే విషయం. ఇక, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మేం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అదృష్టవశాత్తు మేం టెస్టు ఆటగాళ్లం. వందకు పైగా టెస్టులు ఆడా. కాబట్టి మరుసటి రోజు తిరిగి వచ్చి ఎలా ఆడామో మాకు తెలుసు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: ఓటమి బాధలో ఉన్న పాక్​కు మరో షాక్!

Show comments