iDreamPost
android-app
ios-app

నేను కుందేలులా ఉంటానని ధోని ఆ పేరు పెట్టాడు: కోహ్లీ

  • Published Sep 06, 2023 | 12:25 PM Updated Updated Sep 06, 2023 | 12:25 PM
  • Published Sep 06, 2023 | 12:25 PMUpdated Sep 06, 2023 | 12:25 PM
నేను కుందేలులా ఉంటానని ధోని ఆ పేరు పెట్టాడు: కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్‌ ధోని-విరాట్‌ కోహ్లీల మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. తన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ధోని ఒక్కడే తనకు అండగా నిలిచాడని, మిగతా వాళ్లంతా మీడియాతో మాటలు మాత్రం చెప్పారని అన్నాడు. ఆ తర్వాత గతేడాది జరిగిన ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌ అందుకున్న కోహ్లీ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్‌తో బిజీగా ఉన్న కోహ్లీ తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ధోని పెట్టిన నిక్‌నేమ్‌ తో పాటు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

కోహ్లీకి ‘చీకూ’ అనే నిక్‌నేమ్‌ ఉంది. అయితే ఈ పేరును ధోనినే కోహ్లీకి పెట్టాడు. మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో కోహ్లీని పలుమార్లు చీకూ చీకూ అని పిలవడంతో ఆ పేరు ఫేమస్‌ అయింది. అసలు ధోని తనకు చీకూ అని పేరేందుకు పెట్టాడో తాజాగా కోహ్లీ ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. కోహ్లీ మాట్లాడుతూ..‘తన చెవులు కాస్త పెద్ద ఉండి పైకి ఉంటాయని, ఒకసారి నేను హెయిర్‌ కట్‌ బాగా చిన్నగా చేయించినప్పుడు చెవులు పైకి పెద్దవిగా కనిపించాయి. అప్పుడు ధోని.. నన్ను చీకూ అని పిలిచాడు. నా చెవులు కుందేలులా ఉన్నాయని, ఓ కార్డున్‌లో కుందేలు క్యారెక్టర్‌ పేరుతో అలా పిలిచేవాడు’ అని కోహ్లీ వెల్లడించాడు.

అలాగే.. తన క్రికెట్‌ ఐడిల్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో బెన్‌ స్టోక్స్‌ తన ఫేవరేట్‌ క్రికెటర్‌ అని కోహ్లీ తెలిపాడు. గ్రౌండ్‌లో నలువైపులా అద్భుతమైన షాట్లు ఆడే కోహ్లీ.. తన ఫేవరేట్‌ షాట్‌ ఏదో కూడా చెప్పాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో ఇన్‌సైడ్‌ అవుట్ ఓవర్‌ కవర్స్‌లో ఆడే షాట్‌ తన ఫేవరేట్‌ అని కోహ్లీ పేర్కొన్నాడు. మరి కోహ్లీ వెల్లడించిన ఆసక్తికర విషయాలతో పాటు ధోని అతనికి చీకూ అని పేరు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయకండి! రిపోర్టర్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş