iDreamPost
android-app
ios-app

Virat Kohli: సముద్ర తీరంలో కోహ్లీ లగ్జరీ ఇంటిని చూశారా? వీడియో రిలీజ్‌ చేసిన కింగ్‌!

  • Published Jul 09, 2024 | 12:01 PM Updated Updated Jul 09, 2024 | 12:01 PM

Virat Kohli, Alibaug, Mumbai: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన చిన్న కుటుంబంతో ఉండబోయే లగ్జరీ ఇంటికి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశాడు. మరి ఆ బంగ్లా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Alibaug, Mumbai: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన చిన్న కుటుంబంతో ఉండబోయే లగ్జరీ ఇంటికి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశాడు. మరి ఆ బంగ్లా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 09, 2024 | 12:01 PMUpdated Jul 09, 2024 | 12:01 PM
Virat Kohli: సముద్ర తీరంలో కోహ్లీ లగ్జరీ ఇంటిని చూశారా? వీడియో రిలీజ్‌ చేసిన కింగ్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి ఎంతో సంతోషంగా ఉన్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా తన డ్రీమ్‌ హోమ్‌లోకి కూడా అడుగుపెట్టనున్నాడు. ముంబైలోని అలీబాగ్‌ ఏరియాలో తన ఇష్టాలకు, అభిరుచికి అనుగుణంగా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటి నిర్మాణం పూర్తి అయింది. ఇంటి నిర్మాణం పూర్తి అయినట్లు స్వయంగా కోహ్లీనే ఒక వీడియో రిలీజ్‌ చేసి వెల్లడించాడు. తన డ్రీమ్‌ హోమ్‌లో తనకు ఇష్టమైన వారితో ఉండేందుకు ఆగలేకపోతున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే ఆ లగ్జరీ మ్యాన్షన్‌ను నిర్మించిన కంపెనీ అవాస్‌కు ధన్యవాదాలు తెలిపాడు కోహ్లీ. మరి ఆ ఖరీదైన బంగ్లా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలోని అలీ బాగ్‌ ప్రాంతం ఎంతో ఖరీదైన ఏరియా. సముద్ర తీరానికి అనుకోని ఉండటంతో ఇక్కడ నివసించేందుకు చాలా మంది సెలబ్రేటీలు, బడా బడా బిజినెస్‌మెన్లు ఆసక్తి చూపిస్తుంటారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలని భావించి.. 2022లో ఈ అలీబాగ్‌ ప్రాంతంలో ఓ 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ 8 ఎకరాల స్థలం కోసం విరుష్క జంట రూ.19 కోట్లు చెల్లించింది. ఈ 8 ఎకరాల స్థలంలో ఇళ్లు, గార్డెన్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌ ఇలా అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంది. అలాగే రూ.13 కోట్లతో లగ్గరీ ఇంటిని నిర్మించుకున్నారు. కోహ్లీ, అనుష్క అభిరుచులకు తగ్గట్లు అవాస్‌ కంపెనీ ఈ ఇంటిని నిర్మించింది. ఇంటి నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచి కోహ్లీ పలు మార్లు అక్కడి వెళ్లి ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందో పరిశీలించాడు కూడా.

ఇలా ఇంటి పనులు మొదలైనప్పుటి నుంచి జరిగిన విషయాలను ఒక్క చిన్న వీడియలో పొందుపర్చి.. తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు కోహ్లీ. తన డ్రీమ్‌ హోమ్‌లో నివసించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. భార్య అనుష్క శర్మ, కూతురు వామికా, కొడుకు ఆకాయ్‌తో కలిసి కోహ్లీ ఇక్కడ నివసించనున్నారు. కాగా, ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. జట్టుతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చిన కోహ్లీ.. ముంబైలో జరిగిన విక్టరీ పరేడ్‌లో పాల్గొని అనంతరం లండన్‌ వెళ్లిపోయాడు. ప్రస్తుతం రెస్ట్‌ మూడ్‌లో ఉన్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ కోసం తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముంబైలో నిర్మాణం పూర్తి ఇంట్లోకి గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరి కోహ్లీ కొత్త ఇళ్లు ఎలా ఉందో కిందున్న వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom