World Cup 2023: కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు.. కానీ, ఈ తప్పు చేస్తున్నాడా?

న్యూజిలాండ్‌పై కోహ్లీ 95 పరుగులు చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 103 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ కామన్‌గా ఓ తప్పు చేశాడు. బంగ్లాతో పరిస్థితులు వేరు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ, న్యూజిలాండ్‌పై కూడా కోహ్లీ అలాంటి తప్పే చేశాడు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్‌పై కోహ్లీ 95 పరుగులు చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 103 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ కామన్‌గా ఓ తప్పు చేశాడు. బంగ్లాతో పరిస్థితులు వేరు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ, న్యూజిలాండ్‌పై కూడా కోహ్లీ అలాంటి తప్పే చేశాడు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే వరల్డ్‌ కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఆదివారం పటిష్టమైన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్ల తేడా బంపర్‌ విక్టరీ కొట్టిన టీమిండియా.. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు షమీ, బుమ్రా, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. కుల్దీప్‌ యాదవ్‌ భారీగా పరుగులు ఇచ్చినా రెండు వికెట్ల తీశాడు. ఇక జడేజా వికెట్లు తీయకపోయినా.. 10 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ మాత్రమే పడొట్టినా.. 10 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే ఇచ్చారు. షమీ.. కాస్త ఎక్స్‌పెన్సీవ్‌గా ఉన్నా 5 వికెట్ల హాల్‌ సాధించి, 300లకి పైగా పరుగులు చేయాల్సిన కివీస్‌ను 273కే కట్టడి చేశాడు.

అలాగే ఛేజింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే.. విరాట్‌ కోహ్లీ లాంటి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ గెలిపించాడు. అలాగే గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, జడేజా పర్వాలేదనిపించి, మంచి కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. అతను కూడా కోహ్లీతో మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వల్ల రనౌట్‌ అయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతమని చెప్పాలి. ఒక టీమ్‌గా ఆడి గెలిచింది టీమిండియా. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయలేదని కొంతమంది క్రికెట్‌ అభిమానులు బాధపడుతున్నారు. కానీ, కోహ్లీ సెంచరీ కోసమే ఆడుతున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే..

గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి, కోహ్లీ సెంచరీకి సేమ్‌ రన్స్‌ అవసరమైన సమయంలో కేఎల్‌ రాహుల్‌కు స్ట్రైక్‌ ఇవ్వకుండా, రాహుల్‌ కూడా సింగిల్స్‌ తీసుకోకుండా కోహ్లీ సెంచరీకి సహకరించాడు. సరే కోహ్లీ అప్పటి వరకు బాగా ఆడాడు, మ్యాచ్‌ కూడా ఈజీగా గెలిచే ఛాన్స్‌ ఉండటంతో కోహ్లీ అలా ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకోని బ్యాటింగ్‌ చేసి, సెంచరీ పూర్తి చేసుకున్నా ఎవరికీ పెద్దగా ఎలాంటి కంప్లైంట్స్‌ లేవు. కానీ, ఈ మ్యాచ్‌లో 80ల్లోకి వచ్చిన తర్వాత కోహ్లీ సెంచరీ కోసం ప్రయత్నించాడు. జడేజాకు పెద్దగా స్ట్రైక్‌ ఇవ్వకుండా.. జడేజా కొట్టిన షాట్‌కు రెండు రన్స్‌ అవసరమైన సమయంలో కూడా సింగిల్‌ తీస్తూ కనిపించాడు. దీంతో కోహ్లీ సెంచరీ కోసం ఆడుతున్నాడనే ముద్ర పడింది. చివర్లో టీమిండియా విజయానికి 5 పరుగులు, కోహ్లీ సెంచరీకి 5 పరుగులు కావాల్సిన సమయంలో భారీ షాట్‌ ఆడిన కోహ్లీ క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు.

అయితే.. ఇప్పటికే వన్డేల్లో 48 సెంచరీలు, ఓవరాల్‌గా 78 సెంచరీలు చేసి ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన కోహ్లీకి ఇంత సెంచరీలో పిచ్చి ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారు. కేవలం సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీల రికార్డును బ్రేక్‌ చేయడానికే కోహ్లీ ఈ మధ్య అలా ఆడుతున్నాడని అంటున్నారు. కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు, టీమ్‌ని గెలిపిస్తున్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చివర్లో చేసిన పని మాత్రమ చాలా మందికి నచ్చడం లేదు. ఎందుకంటే అప్పటికే 5 వికెట్లు పడిఉన్నాయి. కోహ్లీ-జడేజా ఇద్దరిలో ఎవరూ అవుటైనా.. తర్వాత బ్యాటింగ్‌ చేసే వారు లేరు. ఉన్నదంతా టెయిలెండర్లే. వారిపై నమ్మకం పెట్టుకోవడం కష్టం. కొట్టాల్సింది తక్కువ స్కోరే అయినా.. బంతులు కూడా ఏం అంత ఎక్కువగా లేవు. పైగా అక్కడుంది బంగ్లాదేశ్‌ లాంటి టీమ్‌కాదు. సందు దొరికితే మ్యాచ్‌ను లాగేసుకునే న్యూజిలాండ్‌. అందుకే కోహ్లీ ఈ చిన్న తప్పు చేయకుండా.. కేవలం టీమ్‌ కోసమే ఆడాలని, వ్యక్తిగత రికార్డులను ఈ వరల్డ్‌ కప్‌లో పక్కనపెట్టాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్‌. గతంలో సచిన్‌పై కూడా ఇలానే వ్యక్తిగత రికార్డుల కోసం ఆడే వాడనే అపవాదు ఉంది. ఇప్పుడు కోహ్లీపై కూడా అలాంటి ముద్ర పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు క్రికెట్‌ నిపుణులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: ఇండియా vs కివీస్‌ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బ్రేక్‌ అయ్యాయో తెలుసా?

Show comments