కోహ్లీ మరో ఘనత.. సచిన్ టెండూల్కర్​తో సమానంగా నిలిచిన విరాట్!

  • Author singhj Published - 08:21 PM, Mon - 30 October 23

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్​తో సమానంగా నిలిచాడు కింగ్ కోహ్లీ.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్​తో సమానంగా నిలిచాడు కింగ్ కోహ్లీ.

  • Author singhj Published - 08:21 PM, Mon - 30 October 23

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా విక్టరీలు కొడుతూ కప్పు తమదే అని భారత్ టీమ్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతోంది. ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను చిత్తుగా ఓడిస్తూ మెగా టోర్నీలో రోహిత్ సేన ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. టీమిండియాతో మ్యాచ్ అంటేనే అవతలి జట్టు భయపడేలా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ మన ప్లేయర్లు తగ్గేదేలే అనేలా పెర్ఫార్మ్ చేస్తున్నారు. దీంతో వాళ్ల జోరును అడ్డుకోవడం ఎవరి వల్లా కావడం లేదు.

మెగా టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత టీమ్ మొత్తం 12 పాయింట్లతో ఈసారి సెమీఫైనల్​కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మరో మూడు మ్యాచ్​లు మిగిలి ఉండగానే రోహిత్ సేన సెమీస్​కు క్వాలిఫై అయిపోయింది. దీంతో ఈ మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​ ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంది. వరుసగా విఫలమవుతున్న శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​ల్లో ఒకర్ని తప్పించి యంగ్ బ్యాటర్ ఇషాన్​ కిషన్​కు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి శార్దూల్ ఠాకూర్​ను మరోమారు టెస్ట్ చేసే వీలు కూడా ఉంది.

గాయంతో ఇబ్బంది పడుతున్న ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మరో మూడు మ్యాచులు అందుబాటులో ఉండడని క్రికెట్ వర్గాల సమాచారం. సెమీస్ కల్లా హార్దిక్ కోలుకుంటే భారత్ మరింత డేంజరస్​గా మారుతుంది. సో, మిగిలిన లీగ్ మ్యాచెస్​ను తీసేస్తే.. కప్పు కొట్టాలంటే టీమిండియాకు సెమీస్, ఫైనల్స్ మాత్రమే కీలకం. ఆ రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే కోట్లాది మంది భారతీయుల కలలు నెరవేరినట్లే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్​తో మ్యాచ్​లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. అతడు గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. బ్యాట్​తో కాంట్రిబ్యూషన్ ఇవ్వకున్నా ఫీల్డింగ్​లో అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ రోహిత్​కు, బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ కనిపించాడు.

ఇంగ్లీష్ టీమ్​తో మ్యాచ్​లో వికెట్లు పడగానే బౌలర్లలో ఫుల్ జోష్ నింపాడు కోహ్లీ. అలాంటి విరాట్ ఈ మ్యాచ్​తో మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్స్​లో కోహ్లీకిది 27వ గెలుపు కావడం విశేషం. దీంతో అతడు లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. మెగా టోర్నీలో సచిన్ ప్రాతినిధ్యంలో భారత్ 27 మ్యాచుల్లో గెలుపొందింది. ఇప్పుడీ రికార్డును కింగ్ కోహ్లీ సమం చేశాడు. మరో మ్యాచ్​లో నెగ్గితే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. మరి.. కోహ్లీ అరుదైన ఘనతపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీతో పాటు బౌలర్లకే క్రెడిట్.. అతడ్ని ఎందుకు మర్చిపోతున్నారు?

Show comments