వన్డే వరల్డ్ కప్-2023లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కప్ హిస్టరీలోనే ఎవరూ సాధించలేని రేర్ ఫీట్‌ను అతడు నమోదు చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కప్ హిస్టరీలోనే ఎవరూ సాధించలేని రేర్ ఫీట్‌ను అతడు నమోదు చేశాడు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్బ్‌గా ఆడుతోంది. టాస్ నెగ్గి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే తన డెసిజన్కు సంపూర్ణ న్యాయం చేస్తూ మొదటి ఓవర్ నుంచే పిచ్చకొట్టుడు స్టార్ట్ చేశాడు. న్యూజిలాండ్ మెయిన్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీని టార్గెట్ చేసుకొని బౌండరీలు, సిక్సులు కొట్టాడు హిట్‌మ్యాన్. అతడి దెబ్బకు భారత్ 8 ఓవర్లలోనే 70 పరుగులు చేసింది. వేగంగా ఆడే క్రమంలో రోహిత్ ఔటైనా.. విరాట్ కోహ్లీ (117 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్ (79 రిటైర్డ్ హర్ట్) నిలబెట్టాడు. కోహ్లీని ఒక ఎండ్‌లో ఉంచి తానే హిట్టింగ్‌కు దిగాడు గిల్. స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సులతో హోరెత్తించాడు. అయితే సూపర్ టచ్‌లో కనిపించిన గిల్ సెంచరీ చేసేలానే కనిపించాడు. కానీ క్రాంప్స్ కారణంగా అతడు గ్రౌండ్‌ను వీడాడు.
నాకౌట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ముంబైలో తీవ్ర ఉక్కపోతగా ఉండటంతో భారత బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. గిల్‌లాగే విరాట్ కోహ్లీ కూడా క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డాడు. అయితే శుబ్‌మన్ మాత్రం గ్రౌండ్లో నుంచి వెళ్లిపోయాడు. క్రాంప్స్ వల్ల రన్స్ తీయడం కుదరక రాంగ్ షాట్ ఆడి ఔట్ అవుతాడేమోననే ఉద్దేశంతో అతడ్ని వెనక్కి పిలిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన గిల్‌కు ఫిజియో ట్రీట్మెంట్ అందిస్తూ కనిపించాడు. ఇక, గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ రికార్డు స్థాయిలో 50వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీనియర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌ను నడిపించగా.. శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 77 నాటౌట్) కివీస్ బౌలర్లను టార్గెట్ చేసి భారీ షాట్లు ఆడాడు. బౌల్ట్‌తో పాటు సౌతీ, ఫిలిప్స్ బౌలింగ్‌లో అయ్యర్ భారీ సిక్సులు బాదాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీకి చేరువైన కోహ్లీ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరల్డ్ కప్ ఎడిషన్‌లో హయ్యెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు విరాట్. ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన సచిన్ టెండూల్కర్ (673 రన్స్)ను కోహ్లీ (674*) అధిగమించాడు. ఈ లిస్టులో మాథ్యూ హేడెన్ (659), రోహిత్ శర్మ (648), డేవిడ్ వార్నర్ (647) ఉన్నారు. ఇక, వన్డే వరల్డ్ కప్‌లోనే కాదు టీ20 వరల్డ్ కప్‌లోనూ ఒకే ఎడిషన్‌లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ కోహ్లీనే కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఘనత కింగ్ కోహ్లీ పేరు మీదే ఉంది. నాకౌట్ మ్యాచ్‌లో కోహ్లీ మరో ఘనతను కూడా సాధించాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు అందుకున్న ప్లేయర్‌గానూ విరాట్ నిలిచాడు. మరి.. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గిల్ బ్యాటింగ్ చూసి సంతోషంలో మునిగిపోయిన పేరెంట్స్.. కెప్టెన్ రోహిత్ కూడా..!
THE 🐐 OF WORLD CRICKET…!!! pic.twitter.com/tDQKxbEdGW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023