Nidhan
Virat Kohli, Highest-Paid Cricketer, Highest-Paid Athletes: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్జనలో దూసుకెళ్తున్నాడు. క్రికెట్ ఆడటంతో వస్తున్న డబ్బులతో పాటు యాడ్స్, బిజినెస్‌ల ద్వారా కూడా భారీగానే వెనకేసుకుంటున్నాడు.
Virat Kohli, Highest-Paid Cricketer, Highest-Paid Athletes: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్జనలో దూసుకెళ్తున్నాడు. క్రికెట్ ఆడటంతో వస్తున్న డబ్బులతో పాటు యాడ్స్, బిజినెస్‌ల ద్వారా కూడా భారీగానే వెనకేసుకుంటున్నాడు.
Nidhan
క్రికెటర్స్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆడియెన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. ఆన్ ది ఫీల్డ్‌తో పాటు ఆఫ్ ది ఫీల్డ్‌లో వాళ్ల లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ తదితర విశేషాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ల సంపాదన, ఆదాయం లాంటివి కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వివరాలు ఎప్పుడో గానీ బయటకు రావు. తాజాగా ఓ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లలో భారీగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్ల ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన స్పోర్ట్స్పర్సన్స్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచిన కింగ్.. ఈసారి ఆదాయం జాబితాలోనూ టాప్‌లో నిలిచాడు. రూ.66 కోట్లు పన్ను రూపంలో చెల్లించిన కోహ్లీ.. గత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర ఆదాయాన్ని వెనకేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్‌వైడ్‌గా ఉన్న అథ్లెట్ల ఆదాయం గురించి స్టాటిస్టా ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కోహ్లీ పేరు కూడా ఉంది. వార్షిక ఆదాయంలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు కింగ్. గత 12 నెలల్లో అతడు అక్షరాలా రూ.847 కోట్లు ఆర్జించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. హయ్యెస్ట్ పెయిడ్ క్రికెటర్‌గా నిలిచిన ఈ భారత బ్యాటర్.. హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ లిస్ట్‌లో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (రూ.2,081 కోట్లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 2023 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2024 సెప్టెంబర్ 1 మధ్య సంపాదించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్‌ను తయారు చేశారు. ప్రముఖ గోల్ఫర్ జాన్ రెహమ్ (రూ.1,712 కోట్లు) టాప్-2లో చోటు దక్కించుకున్నాడు. మరో ఫుట్‌బాలర్ మెస్సీ (రూ.1,074 కోట్లు) మూడో స్థానంలో నిలిచాడు.
హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ లిస్ట్‌లో కోహ్లీ ఒక్కడే క్రికెటర్. మిగతా వాళ్లంతా ఫుట్‌బాల్, గోల్ఫ్, బాస్కెట్ బాల్ నేపథ్యం కలిగిన వారే కావడం విశేషం. దీని గురించి తెలిసిన నెటిజన్స్.. కోహ్లీ రేంజ్ ఏంటో ఇది చెబుతోందని అంటున్నారు. అతడు గ్లోబల్ సూపర్‌స్టార్ అని.. ఇంత మొత్తంలో ఆదాయం సంపాదించడం అంటే మాటలు కాదని చెబుతున్నారు. అతడు ఇదేరీతిలో మరికొన్నేళ్లు ఆడితే ఈ లిస్ట్‌లో ఇంకా పైకి చేరుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక, సంపాదనలో దూసుకెళ్తున్న కోహ్లీ.. భారత జట్టుతో పాటు ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడటం ద్వారా భారీగా ఆర్జిస్తున్నాడు. యాడ్స్ ద్వారా కూడా బిగ్ అమౌంట్‌ను వెనకేసుకుంటున్నాడు. క్లోతింగ్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్‌ల ద్వారా తన ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నాడు. రీసెంట్గా ఫార్చూన్ ఇండియా వెల్లడించిన రిపోర్ట్‌లో కోహ్లీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల ట్యాక్స్ కట్టాడని తేలింది. ఇప్పుడు అతడి వార్షిక ఆదాయం రూ.847 కోట్లు అని బయటపడింది. మరి.. కింగ్ ఆదాయంలో టాప్‌లో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
VIRAT KOHLI IS THE HIGHEST Paid CRICKETER IN THE WORLD IN LAST 12 MONTHS. 🐐(Statista Report).
– King Kohli’s estimated earnings 847 Crores INR…!!!! 🤯 pic.twitter.com/rDP5bgTWAo
— Tanuj Singh (@ImTanujSingh) September 6, 2024