IND vs SA: టెస్ట్‌ సిరీస్‌కి ముందు సౌతాఫ్రికా ఆటగాళ్ల షాకింగ్‌ స్టేట్‌మెంట్‌! ఆ ఒక్కడే..

ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు సౌతాఫ్రికా జట్టులోని స్టార్‌ ఆటగాళ్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వాళ్ల మాటలు వింటే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ గ్యారెంటీ. మరి వాళ్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు సౌతాఫ్రికా జట్టులోని స్టార్‌ ఆటగాళ్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వాళ్ల మాటలు వింటే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ గ్యారెంటీ. మరి వాళ్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్‌ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని, టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీ20 సిరీస్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌, వన్డే సిరీస్‌ను కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమిండియా, పటిష్టమైన సౌతాఫ్రికాను ఎదుర్కొని నిలబడింది. అయితే.. ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌ కోసం టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టులోకి రానున్నారు. దీంతో.. భారత జట్టు మరింత బలపడింది. కానీ, సౌతాఫ్రికాను వాళ్ల దేశంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అలా అని టీమిండియాను సౌతాఫ్రికా కూడా తక్కువ అంచనా వేయడం లేదు.

ఎందుకంటే.. టీమిండియాలో ఒక్క ఆటగాడికి మొత్తం సౌతాఫ్రికా జట్టు భయపడుతోంది. వాళ్ల దేశంలో మ్యాచ్‌ ఉన్నా సరే భారత జట్టులోని ఆ ఒక్క ఆటగాడికి భయపడుతున్నారు అంటే.. అతను సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాపై ఏదో అద్భుతం చేసి ఉంటాడు. ఒక్క సౌతాఫ్రికాలోనే కాదు మొత్తం ప్రపంచ క్రికెట్‌కే కింగులా మారిన విరాట్‌ కోహ్లీ గురించే సౌతాఫ్రికా జట్టు ఆందోళన చెందుతోంది. సెంచూరియన్‌ వేదికగా జరగనున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌కి ముందు బ్రాడ్‌కాస్ట్‌తో మాట్లాడిన సౌతాఫ్రికా ఆటగాళ్లు.. టెంబ బవుమా, కేశవ్‌ మహరాజ్‌, మార్కరమ్‌, కగిసో రబడా, మార్కో జాన్సెన్‌.. విరాట్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు.

కోహ్లీ గొప్ప ఆటగాడని, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేసి.. మ్యాచ్‌ను లాగేసుకుంటాడని పేర్కొన్నారు. ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ నుంచి పెద్ద ప్రమాదం తమకు కోహ్లీ నుంచే ఉందని టెంబ బవుమా పేర్కొన్నాడు. రబడా మాట్లాడుతూ.. సౌతాఫ్రికాలో తమపై కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉందని, అలాంటి గ్రేట్‌ ప్లేయర్‌తో గేమ్‌ ఆడితే మజా వస్తుందని, అదే అసలైన గేమ్‌ అంటూ పేర్కొన్నాడు. ఇలా సౌతాఫ్రికాలోని టాప్‌ ప్లేయర్లు కోహ్లీ గురించి చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments