SNP
పదేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న విరాట్ కోహ్లీ.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీతో బిజీగా ఉన్న మోడ్రన్ సూపర్ స్టార్.. తన కెరీర్ గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పదేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న విరాట్ కోహ్లీ.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీతో బిజీగా ఉన్న మోడ్రన్ సూపర్ స్టార్.. తన కెరీర్ గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో అతనో సంచలనం. ఇండియన్ క్రికెట్ క్రికెట్‌లో అతనే కింగ్. దాదాపు 12 ఏళ్ల నుంచి ఇండియన్ క్రికెట్‌ను ఏలుతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ కూడా బాదేశాడు. రెండు మ్యాచ్‌ల్లో దాదాపు సెంచరీకి అతి చేరువుగా వచ్చి అవుట్ అయ్యాడు. లేకుంటే.. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ ఖాతాలో మూడు సెంచరీలు ఉండేవి. ఇక జట్టుకు కచ్చితంగా అవసరమైన సమయంలో కోహ్లీ ఎంతో అద్భుతంగా ఆడుతుండటంతో టీమిండియాకు కొండంత అండగా మారింది.
ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 85 రన్స్ చేసి ఎంతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 55 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పాకిస్థాన్‌పై 16 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. ఆ వెంటనే బంగ్లాదేశ్‌పై సెంచరీతో చెలరేగాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. 95 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లీ డకౌట్ అయ్యాడు. మొత్తం మీద ఈ టోర్నీలో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. ఇటీవల తన కెరీర్‌లో 13వ ఏట అడుగుపెట్టిన కోహ్లీ.. తన కెరీర్ గురించి స్పందిస్తూ.. ఇంత దూరం రావాలని కల అయితే కన్నాను కానీ.. అనుకున్నట్లు జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదని అన్నాడు.
ఇదంతా దేవుడి దయ అని పేర్కొన్నాడు. ఇదంతా నేను ప్లాన్ చేసుకోలేదని, జస్ట్ నేను జట్టు కోసం ఆడాలని అనుకున్నానని, జట్టు కోసం గ్రౌండ్‌లో తన వందశాతం ఇచ్చానని అదే ఇదంతా ఇచ్చిందని, నాపై ఆ దేవుడి ఆశీస్సులతో ఇంత లాంగ్ కెరర్ సాధ్యమైందని పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ ఒక సూపర్ స్టార్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేస్తూ.. కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ కూడా ప్రస్తవించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌కు కోహ్లీనే ముఖచిత్రంగా ఉన్నాడు. మరి కోహ్లీ తన కెరీర్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Elite mindset 💯
Watch #King @imVkohli share how his journey so far unfolded!
Tune-in to #INDvSL in the #WorldCupOnStar
THU, NOV 2, 12.30 PM onwards | Star Sports Network#CWC23 #Cricket pic.twitter.com/ErV0MpU6o8— Star Sports (@StarSportsIndia) October 31, 2023