iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీనే పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చాడు.. అతను ఎవరంటే..?

  • Author singhj Published - 11:52 AM, Fri - 18 August 23
  • Author singhj Published - 11:52 AM, Fri - 18 August 23
వీడియో: కోహ్లీనే పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చాడు.. అతను ఎవరంటే..?

విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ ఆడేవాళ్లు, చూసేవాళ్లే కాదు.. జెంటిల్మన్ గేమ్​తో పరిచయం అక్కర్లేని వారికి కూడా విరాట్ గురించి బాగా తెలుసు. అంతగా క్రీడా ప్రపంచంపై తన ముద్ర వేశాడతను. గత 15 ఏళ్లుగా అద్భుతంగా ఆడుతూ కోట్లాది మంది అభిమానుల మనసులను దోచుకున్నాడు కోహ్లీ. అతడికి భారత్​లోనే గాక ఎన్నో దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. స్వయంగా కొందరు క్రికెటర్లే విరాట్ ఫ్యాన్స్ కావడం విశేషం. పట్టుదల, స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నాడతడు. విరాట్ ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోడు.

కోహ్లీ ఆడే విధానం, ఓటమిని ఒప్పుకోని తత్వమే ఇంతమంది అభిమానాన్ని గెలుచుకోవడానికి కారణమని చెప్పొచ్చు. అలాంటి విరాట్ తనను ఇంతగా ఆరాధిస్తున్న అభిమానులను ఎప్పుడూ గౌరవిస్తాడు. వాళ్లతో అవకాశం దొరికినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతాడు. సోషల్ మీడియాలో వాళ్లతో ముచ్చటిస్తుంటాడు. బయట కూడా ఫ్యాన్స్ అడగ్గానే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్​లు ఇస్తుంటాడు. అభిమానులను అస్సలు డిజప్పాయింట్ చేయడు. వాళ్లను సంతోషపెట్టడం కోహ్లీకి ఒక అలవాటు అనే చెప్పాలి. ఇలా విరాట్ తన ఫ్యాన్స్​ను సంతోషపెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి.

తాజాగా మరోసారి అభిమానులకు తాను ఎంత విలువ ఇస్తాడో నిరూపించుకున్నాడు కోహ్లీ. వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్న విరాట్​ను ఒకచోట ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అందులో ఒక అభిమాని టీమిండియా స్టార్​తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డాడు. కానీ కుదరకపోవడంతో దూరం నుంచే సెల్ఫీ తీసుకోబోయాడు. ఇది చూసిన విరాట్.. అతడ్ని తన దగ్గరకు పిలిచాడు. ఆ అభిమానితో కలసి సెల్ఫీ దిగి పంపించాడు. కోహ్లీ చేసిన పనికి ఆ ఫ్యాన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అభిమానిని పిలిచి మరీ సెల్ఫీ దిగిన కోహ్లీని అందరూ మెచ్చుకుంటున్నారు. అతడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడని ప్రశంసిస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkare girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis