కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌గా కరోలీ బాబా ఫొటో! ఏంటి ఆయన ప్రత్యేకత?

కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌గా కరోలీ బాబా ఫొటో! ఏంటి ఆయన ప్రత్యేకత?

Virat Kohli, Neem Karoli Baba: ప్రపంచ క్రికెట్‌కు బ్రాండ్‌ అం‍బాసిడర్‌ లాంటి విరాట్‌ కోహ్లీ తన ఫొటోలో ఓ సాధువు ఫొటో పెట్టుకున్నాడు. మరి ఆయన అంత పవర్‌ఫులా అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ బాబా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Neem Karoli Baba: ప్రపంచ క్రికెట్‌కు బ్రాండ్‌ అం‍బాసిడర్‌ లాంటి విరాట్‌ కోహ్లీ తన ఫొటోలో ఓ సాధువు ఫొటో పెట్టుకున్నాడు. మరి ఆయన అంత పవర్‌ఫులా అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ బాబా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి దైవ భక్తి చాలా ఎక్కువ. క్రికెట్‌ నుంచి కాస్త ఖాళీ సమయం దొరికితే.. భార్య అనుష్క శర్మతో కలిసి ఆలయాలకు వెళ్తూ ఉంటాడు. అయితే.. కోహ్లీకి ఇష్టదైవం ఎవరనేది మాత్రం చాలా మందికి తెలియదు. కానీ, తాజాగా కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌గా ఓ ఆధ్యాత్మిక గురువు, కొంతమంది సాక్ష్యాత్తు దైవస్వరూపంగా భావించే ‘నీమ్‌ కరోలీ బాబా’ ఫొటో ఉండటంతో.. ఆయన కోహ్లీ అత్యంత ఇష్టమైన దైవమని, ఆయననే కోహ్లీ ఎక్కువగా విశ్వసిస్తూ, ఆరాధిస్తూ ఉంటాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా.. ముంబైలో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు.

ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్‌ టాప్‌ బస్‌లో భారత క్రికెటర్లు టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలోనే విరాట్‌ కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌పై నీమ్‌ కరోలీ బాబా ఫొటో ఉండటం కెమెరా కంటికి చిక్కింది. దీంతో.. ఒక్కసారిగా నీమ్‌ కరోలీ బాబా ఎవరు? విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ క్రికెటర్‌ ఆయన ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడంటే ఆయన ఎంతో పవర్‌ ఫుల్‌ అయి ఉంటాడంటూ క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

నీమ్‌ కరోలీ బాబాను.. నీబ్‌ కరోరీ బాబా అని కూడా పిలుస్తారు. అలాగే మహరాజ్‌ జీ అని కూడా అంటారు. ఈయనను సాక్ష్యాత్తు హనుమంతిని స్వరూపంగా భావిస్తారు. ఆయన జీవించి ఉన్న సమయంలో హనుమాన్‌ను ఎక్కువగా ఆరాధించే వారు. 20వ శతాబ్ధపు మహనీయుల్లో ఆయనను ఒకరిగా గుర్తిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కరోలీ బాబాకు సంబంధించిన ఆశ్రమాలు, దేవాలయాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ప్రధాన ఆశ్రమం నైనితాల్‌కు 65 కిలో మీటర్ల దూరంలోని పంత్‌నగర్‌లో ఉంది. 1900లో జన్మించిన కరోలీ బాబా 1973లో మరణించారు. కరోలీ బాబా అసలు పేరు లక్ష్మణ్‌ దాస్‌. 1958లో లక్ష్మణ్‌ దాస్‌.. ఆధ్యాత్మిక చింతనలో గడిపేందుకు ఇంటిని వదిలిపెట్టారు.

ఆ సమయంలో టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణించడంతో.. టీటీ అతన్ని కరోలీ గ్రామ సమీపంలో రైలు నుంచి కిందికి దింపేస్తాడు. ఆ తర్వాత రైలు ముందుకు కదలదు. దీంతో.. అంతా ఆ సాధువు రైలు నుంచి కిందికి దింపడం వల్లే రైలు ముందుకు కదలడం లేదని, ఆ బాబాను ఎక్కించుకోవాలని ప్రయాణికులు సూచించడంతో టీటీ అతన్ని మళ్లీ రైలు ఎక్కించుకుంటాడు. అయితే.. బాబా రెండు షరుతులతో మళ్లీ రైలు ఎక్కుతారు. అవేంటంటే.. కరోలీ గ్రామంలో రైల్వే స్టేషన్‌ నిర్మించాలని రైల్వే అధికారులకు సిఫారసు చేయాలి, అలాగే సాధువుల పట్ల సామరస్యంగా వ్యవహరించాలని కోరతారు. వాటికి టీటీ అంగీకరించడంతో లక్ష్మణ్‌ దాస్‌ రైలు ఎక్కిన తర్వాత రైలు ముందుకు కదులుతుంది. ఆయన కరోలీ గ్రామంలో దిగడం అక్కడే కొంత కాలం ఉండటంతో ఆయనకు నీమ్‌ కరోలీ బాబా అనే పేరు వచ్చింది. మరి ఇంత పవర్‌ ఫుల్‌ అయిన నీమ్‌ కరోలీ బాబా ఫొటోను కోహ్లీ వాల్‌పేపర్‌గా పెట్టుకోవడంపై మీ అబిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments