రన్ మెషీన్ విరాట్ కోహ్లి వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగి ఆడుతున్నాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ బాదాడు. సహచర ప్లేయర్లు ఒక్కొక్కరు ఔటై పెవిలియన్‌కు చేరుతున్న టైమ్‌లో క్రీజులో అడ్డుగోడలా నిలిచాడు విరాట్. అదే జోరుతో ఆడుతూ తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. తనను పరుగుల యంత్రం అని ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రూవ్ చేశాడు. ఈమధ్య కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీతో కదంతొక్కాడు.
విండీస్‌పై తాజా శతకంతో టెస్టు క్రికెట్లో 29వ సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు కోహ్లి. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 76వ సెంచరీ కావడం విశేషం. ఈ విషయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. అయితే ప్రస్తుత క్రికెట్లో మాత్రం విరాట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈతరం ఆటగాళ్లలో జో రూట్ 46 సెంచరీలు, డేవిడ్ వార్నర్ 45 సెంచరీలతో ఉన్నారు. తాజా శతకంతో పలు రికార్డులను విరాట్ బ్రేక్ చేశాడు. ఓవర్సీస్లో అత్యధిక సెంచరీలు బాదిన లిస్టులో సచిన్ (29 శతకాలు) తర్వాతి ప్లేసులో నిలిచాడు కోహ్లి (28 శతకాలు).
ఇక, విండీస్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ తన క్లాస్ ఆటతీరుతో అదరగొట్టాడు. ట్రిక్కీ పిచ్‌పై ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57), రోహిత్ శర్మ (80) హాఫ్ సెంచరీలతో రాణించి టీమిండియాకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత రోహిత్ సేన ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో తన అనుభవాన్ని రంగరించి ఆడిన విరాట్.. రవీంద్ర జడేజాతో కలసి జట్టును ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరూ గురువారం చివరి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని విసిగించారు. కోహ్లి శుక్రవారం ఉదయం కూడా అదే ఊపును కొనసాగించాడు. భారత్ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 336 రన్స్‌తో ఉంది. కోహ్లి (118 నాటౌట్), జడేజా (53 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Asians with most centuries overseas:
Sachin Tendulkar – 29.
Virat Kohli – 28*.
– Two GOATs of the game! pic.twitter.com/7XcHst4zOX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2023