80 బంతులాడి ఫస్ట్‌ బౌండరీ కొట్టిన కోహ్లీ! రియాక్షన్‌ మాత్రం సెంచరీ చేసినట్టు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ సెంచరీలతో కదంతొక్కారు. వన్‌ డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ నిరాశపర్చినా.. యువ క్రికెటర్‌, అరంగేట్రం మ్యాచ్‌ ఆడుతున్న జైస్వాల్‌ మాత్రం సంచలన బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఏకంగా 143 పరుగులతో రెండో రోజు కూడా నాటౌట్‌గా నిలిచాడు.

మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 103 పరుగులు చేసిన రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లీ.. ప్రస్తుతం 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. జైస్వాల్‌తో కలిసి మూడో రోజు ఆటను ప్రారంభించనున్నాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగుల చేసి.. 162 పరుగుల లీడ్‌ సాధించింది. మూడో రోజు కూడా బ్యాటింగ్‌ చేసి వెస్టిండీస్‌ ముందు భారీ టార్గెట్‌ పెడితే.. ఇన్నింగ్స్‌ తేడాతో మ్యాచ్‌ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెరట్‌, రన్‌ మెషీన్‌ అయినా విరాట్‌ కోహ్లీ చేసిన ఒక పని మాత్రం ఒక వైపు నవ్వు తెప్పిస్తున్నా.. మరోవైపు విమర్శల పాలవుతున్నాడు. గిల్‌ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. 96 బంతుల్లో ఒక ఫోర్‌తో 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించిన కోహ్లీ సింగిల్స్‌, టూస్‌తోనే కొనసాగించాడు. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. 80 బంతుల వరకు ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేదు. మంచి నీళ్ల తాగినంత సింపుల్‌గా బౌండరీలు బాదగలిగే కోహ్లీ.. 80 బంతులు ఎదుర్కొని ఒక్కటంటే ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేదు.

80 బంతుల్లో 25 పరుగులు చేసిన తర్వాత.. 81వ బంతికి కవర్స్‌లో ఫోర్‌ బాదాడు. చాలా సేపటి తర్వాత ఫోర్‌ కొట్టడంతో కాస్త ఎగ్జైట్‌ అయిన కోహ్లీ సరదాగా గాల్లో పంచ్‌ చేశాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 74 సెంచరీలు, వేల కొద్ది పరుగులు ఉన్న ఆటగాడు.. 80 బంతులాడి ఒక్క ఫోర్‌ కూడా కొట్టకపోవడమే ఆశ్చర్యకరమైన విషయమైతే.. 81వ బంతికి ఫోర్‌ కొట్టి అదేదో సెంచరీ అయినట్లు సెలబ్రేట్‌ చేసుకోవడం క్రికెట్‌ అభిమానులతో పాటు కోహ్లీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.

కోహ్లీ అది సరదాగా చేసినా.. నెటిజన్లు మాత్రం 80 బంతులాడి ఫోర్‌ కొట్టి ఆ సెలబ్రేషన్‌ చేసుకోవడం అవసరమా? నీ స్థాయికి ఇది తగునా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్యూ మ్యాచ్‌ ఆడుతున్న ఓ యువ క్రికెటర్‌ సెంచరీతో కదం తొక్కిన పిచ్‌పై ఫస్ట్‌ బౌండరీ కొట్టేందుకు కోహ్లీ 80 బంతులు తీసుకోవడం నిజంగా షాకింగ్‌ విషయమే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెహ్వాగ్‌ను దాటేసిన కోహ్లీ! డేంజర్‌లో లక్ష్మణ్‌ రికార్డు

Show comments