iDreamPost
android-app
ios-app

రెండోసారి తండ్రైన కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ!

Virat Kohli, Anushka Sharma, blessed with baby boy: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Virat Kohli, Anushka Sharma, blessed with baby boy: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

రెండోసారి తండ్రైన కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ!

టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు విరాట్. కానీ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కోహ్లీ వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అనుష్క ఫిబ్రవరి 15వ తారీఖున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు స్వయంగా విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై పలు రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఇటీవలే విరుష్క జంట రెండో బిడ్డకోసం ట్రై చేస్తున్నారని కామెంట్స్ చేశాడు. కానీ అవి అబద్దం అని తర్వాత స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అదే న్యూస్ నిజం కావడంతో విరాట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

“ఈ సంతోషకరమైన విషయన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘అకాయ్’ వామిక లిటిల్ బ్రదర్ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వాడికి మీ అందరి ఆశీస్సులు, ప్రేమకావాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నా ప్రైవసీని గౌరవించండి..థ్యాంక్యూ మీ విరాట్-అనుష్క” అంటూ రాసుకొచ్చాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఈ విషయం ఇంత ఆలస్యంగా కోహ్లీ ఎందుకుచెప్పాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇదికూడా చదవండి: జురెల్ ఫోన్​ను చూస్తే షాకవ్వాల్సిందే.. మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోదుగా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి