Virat Kohli And Sachin Tendulkar Invited For Ram Temple: విరాట్ కోహ్లీకి ఊహించని అదృష్టం.. సచిన్​తో కలసి..!

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఊహించని అదృష్టం.. సచిన్​తో కలసి..!

  • Author singhj Published - 03:44 PM, Wed - 6 December 23

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఊహించని అదృష్టం దక్కింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఊహించని అదృష్టం దక్కింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 03:44 PM, Wed - 6 December 23

వన్డే వరల్డ్ కప్​-2023 ఫైనల్ ఓటమి బాధలో నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మెగా ట్రోఫీని మిస్సయిన బాధలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​లో బరిలోకి దిగింది భారత జట్టు. అయితే ఆ టీమ్​లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుబ్​మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్ లాంటి స్టార్లు బరిలోకి దిగలేదు. ప్రపంచ కప్​లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మాత్రమే ఆసీస్​తో సిరీస్​లో ఆడారు. వీళ్లతో పాటు సీనియర్ అక్షర్ పటేల్ కూడా ప్లేయింగ్ ఎలెవన్​లో ఉన్నాడు. ఆఖరి రెండు టీ20లకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. వీళ్లు తప్పితే ఆ సిరీస్​లో భారత్ నుంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎవరూ ఆడలేదు. కానీ కంగారూ టీమ్ నుంచి మాత్రం ఎక్స్​పీరియెన్స్ ఉన్న చాలా మంది ప్లేయర్లు ఆడారు.

వరల్డ్ కప్ హీరోలు ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్​వెల్​తో పాటు స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్​లు భారత్​తో సిరీస్​లో ఆడారు. ఇంతమంది స్టార్లు టీమ్​లో ఉన్నా పర్యాటక టీమ్ ఓడిపోయింది. 5 టీ20ల ఈ సిరీస్​ను యంగ్​స్టర్స్​తో నిండిన భారత టీమ్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ, రింకూ సింగ్, అర్ష్​దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ లాంటి యువకులు ఈ సిరీస్​లో అద్భుతంగా రాణించారు. సీనియర్లు లేని లోటు ఎక్కడా కనపడకుండా పటిష్టమైన ఆసీస్​ను కంగారెత్తించారు. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నా సూర్యకుమార్ ఆ ప్రెజర్ ఎక్కడా కనపడకుండా.. టీమ్​లోని ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ, సరైన సూచనలు ఇస్తూ ఆకట్టుకున్నాడు. ఈ విజయం ద్వారా సౌతాఫ్రికా సిరీస్​కు మరింత కాన్ఫిడెన్స్​తో బయలుదేరింది టీమిండియా. డిసెంబర్ 10 నుంచి భారత జట్టు సఫారీ టూర్​ను ప్రారంభించనుంది.

సౌతాఫ్రికా టూర్​లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. డిసెంబర్ పదిన మొదలుకానున్న ఈ పర్యటన.. జనవరి 7న లాస్ట్ టెస్ట్​తో పూర్తవ్వనుంది. సఫారీ టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లండ్​తో స్వదేశంలో టెస్ట్ సిరీస్​ ఆడనుంది భారత్. ఇక, సౌతాఫ్రికా టూర్​లో కేవలం టెస్టుల్లోనే ఆడనున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. రెస్ట్ తీసుకునే ఉద్దేశంతో వన్డేలు, టీ20లకు దూరంగా ఉంటానని ముందే బీసీసీఐకి చెప్పేశాడు కింగ్. అలాంటి కోహ్లీకి ఊహించని అదృష్టం వరించింది. కోట్లాది మంది ప్రజలు కొలిచే శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి అతడికి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా లెజెండ్ సచిన్ టెండూల్కర్​తో పాటు కోహ్లీకి ఇన్విటేషన్ అందిందని తెలుస్తోంది. ఇది తెలిసిన అభిమానులు విరాట్​కు దక్కిన అదృష్టం ఇది అని అంటున్నారు. మరి.. కోహ్లీకి ఊహించని అదృష్టం వరించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దిగ్గజ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రణ!

Show comments