విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! దులీప్‌ ట్రోఫీ ఆడనున్న స్టార్లు

Virat Kohli, Rohit Sharma, Duleep Trophy 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. దేశవాళి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమయ్యారు. మరి ఏ ట్రోఫీ, మ్యాచ్‌లు ఎప్పుడు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Rohit Sharma, Duleep Trophy 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. దేశవాళి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమయ్యారు. మరి ఏ ట్రోఫీ, మ్యాచ్‌లు ఎప్పుడు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ డొమెస్టిక్‌ క్రికెట్‌ బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు మరో నెల రోజుల సమయం ఉండటంతో.. ఈ స్టార్లు దేశవాళి క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో తిరుగులేని స్టార్లుగా ఉన్న ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో సాధించి.. రిటైర్మెంట్‌కు దగ్గరపడుతున్న సమయంలో ఇలా దేశవాళి క్రి​కెట్‌ ఆడేందుకు సిద్ధం అవ్వడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకే కదా వీళ్లిద్దరూ ఇంత పెద్ద స్టార్లు అయింది అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు దిగ్గజాలు ఏ దేశవాళి టోర్నీ ఆడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతున్నాయి? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

డొమెస్టిక్‌ క్రికెట్‌ ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీ 2024లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆడేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బీసీసీఐ టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటే, మ్యాచ్‌లు లేని సమయాల్లో దేశవాళి క్రికెట్‌లో ఆడాల్సిందేనని రూల్‌ పెట్టింది. అందులో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా.. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు కాబట్టి.. వాళ్లు ముగ్గురు ఆడాలనుకుంటే డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఆడొచ్చని, కచ్చితంగా ఆడాలనే నిబంధన లేదని పేర్కొంది. వాళ్లు కాకుండా మిగతా టీమిండియా క్రికెటర్లు డొమెస్టిక్‌ క్రికెట్‌లో పాల్గొనాలని సూచించింది బీసీసీఐ. అందులోనా టెస్టు క్రికెట్‌ ఆడే స్టార్‌ క్రికెటర్లు ఫామ్‌లో లేకుంటే మాత్రం కచ్చితంగా ఆడాల్సిందేని ఆదేశించింది.

ఈ క్రమంలోనే శుబ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడజా, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌లను దులీప్‌ ట్రోఫీ ఆడాలని ఆదేశించింది బీసీసీఐ. వీళ్లందరు దులీప్‌ ట్రోఫీ ఆడనున్నారు. వీరితో పాటు కోహ్లీ, రోహిత్‌ కూడా ఆడే అవకాశం ఉంది. ఇషాన్‌ కిషన్‌ కూడా ఈ టోర్నీలో ఆడొచ్చు. సెప్టెంబర్‌ 5 నుంచి 23వ ఏదీ వరకు దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా ఏ, బీ, సీ, డీ అంటూ నాలుగు టీములుగా డివైడ్‌ చేసి.. మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్‌లన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోనే జరగనున్నాయి. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ స్టేడియం, ఏసీఏ డీసీఏ గ్రౌండ్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి డొమెస్టిక్‌ క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్‌ ఆడనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments