Virat Kohli IPL Spat Gautam Gambhir Reaction: కోహ్లీతో గొడవపై మళ్లీ రియాక్ట్ అయిన గంభీర్.. అది తన హక్కంటూ..!

Virat Kohli: కోహ్లీతో గొడవపై మళ్లీ రియాక్ట్ అయిన గంభీర్.. అది తన హక్కంటూ..!

  • Author singhj Published - 03:35 PM, Sat - 9 December 23

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు రియాక్ట్ అయ్యాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు రియాక్ట్ అయ్యాడు.

  • Author singhj Published - 03:35 PM, Sat - 9 December 23

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మధ్య గొడవను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఈ గొడవ చోటుచేసుకుంది. లక్నో పేసర్ నవీనుల్ హక్​ను కోహ్లీ గెలకడం, దానికి అతడు ధీటుగా సమాధానం చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. అది అక్కడే ముగిసిందని అనుకుంటే మ్యాచ్ తర్వాత మళ్లీ స్టార్ట్ అయింది. కోహ్లీ దగ్గరకు లక్నో మెంటార్ గంభీర్ రావడం, ఇద్దరూ ఢీ అంటూ ఢీ అంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. ఆ మ్యాచ్ తర్వాత నవీన్, గంభీర్ ఎక్కడ కనిపించినా వారిని విరాట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వచ్చారు. రీసెంట్​గా ముగిసిన వన్డే వరల్డ్ కప్-2023 వరకు ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు మెగా టోర్నీలో దీనికి ఫుల్​స్టాప్ పడింది.

వరల్డ్ కప్​ లీగ్ స్టేజ్​లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​తో భారత్ మ్యాచ్ సమయంలో కోహ్లీ, నవీన్ పాత గొడవ మరిచి కలసిపోయారు. ఒకర్నొకరు హగ్ చేసుకొని, నవ్వుతూ కనిపించారు. విరాట్​కు ఆఫ్ఘాన్ పేసర్ సారీ చెప్పడంతో అతడ్ని క్షమించేశారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. గంభీర్ మాత్రం రీసెంట్​గా మరో గొడవలో ఇరుక్కున్నాడు. లెజెండ్ లీగ్ క్రికెట్ (ఎల్​ఎల్​సీ) సందర్భంగా వెటరన్ పేసర్ శ్రీశాంత్​-గౌతీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోహ్లీతో అప్పటి కాంట్రవర్సీ కూడా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఐపీఎల్​లో జరిగిన ఆ సంఘటనపై గంభీర్ మరోమారు రియాక్ట్ అయ్యాడు. గొడవ పడటం తన హక్కు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక మెంటార్​గా తన టీమ్​ ప్లేయర్స్​కు ఎల్లవేళలా అండగా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నాడు గంభీర్.

‘మెంటార్​గా నా జట్టులోని ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను ఎల్లవేళలా దీన్నే నమ్ముతా. మ్యాచ్ జరుగుతున్న టైమ్​లో మధ్యలోకి వెళ్లి జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. కానీ ఒక్కసారి మ్యాచ్ ముగిసిన అనంతరం నా ప్లేయర్స్​తో ఎవరైనా సరే గొడవపడితే.. వెళ్లి వాళ్లను అడ్డుకోవడం నా ముందున్న రెస్పాన్సిబిలిటీ. అవతలి దిక్కు ఉన్నది ఎంతటి వారైనా సరే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మా ఆటగాళ్లను కాపాడాల్సిన హక్కు కూడా నాకు ఉంది’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా, అహ్మదాబాద్​లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్​కు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీదా గౌతీ స్పందించాడు. రాహుల్ అలాంటి పదాలను వాడకుండా ఉంటే బాగుండేదన్నాడు. ఓడిపోయి నిరాశలో ఉన్న ఆటగాళ్లను కలిసేందుకు వెళ్తే దాన్నీ తప్పుబడతారా? అని సీరియస్ అయ్యాడు. మరి.. కోహ్లీతో గొడవపై గంభీర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

Show comments