SNP
Virat Kohli, Anchor Role, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనతో.. కొంతమంది భారత క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ విలువేంటో అర్థం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Anchor Role, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనతో.. కొంతమంది భారత క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ విలువేంటో అర్థం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన.. భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘పసికూనకు ఎక్కువ.. పెద్ద టీమ్‌కు తక్కువ’ లాంటి శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా తమ స్థాయిలో ఆడటం లేదు. బౌలింగ్ విషయం పక్కనపెడితే.. బ్యాటింగ్‌లోనే టీమిండియా దారుణంగా విఫలం అవుతోంది. బౌలింగ్‌లో.. బుమ్రా, షమీ లాంటి స్టార్లు లేకపోయినా.. మిగతా బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి హేమాహేమీలు ఉన్నా.. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమ్.. ఇప్పుడిలా శ్రీలంకపై కేవలం 241 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక ఓడిపోయింది. పైగా లంకలో వనిందు హసరంగా, పతిరానా, తీక్షణ లాంటి ప్రధాన బౌలర్లు లేకపోయినా.. టీమిండియా గెలవలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే గెలవాల్సిన తొలి వన్డే టై, రెండో వన్డేలో ఓటమి ఎదురైంది.
టీమిండియాలో రోహిత్ శర్మ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. కానీ, మిగతా జట్టు విఫలం అవుతోంది. అందులోనూ విరాట్ కోహ్లీ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇన్ని రోజులు వన్డే జట్టులో యాంకర్ రోల్ పోషింస్తూ.. జట్టులోని మిగతా బ్యాటర్లతో భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. విరాట్ కోహ్లీ అద్భుతమైన వన్డే ఇన్నింగ్స్‌లు ఆడేవాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో అదే చేశాడు. రోహిత్ శర్మ అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆరంభంలో రన్స్ చేస్తే.. తర్వాత అంతా కోహ్లీ చూసుకునే వాడు. ఇప్పుడు రోహిత్ శర్మ అదే ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేస్తున్నా.. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ మిస్ అవుతోంది. స్లో పిచ్‌లపై కాస్త టైమ్ తీసుకొని బాగా ఆడే కోహ్లీ.. శ్రీలంకపై రెండు వన్డేల్లోనూ విఫలం అయ్యాడు.
ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ ఆపుకుని లేకపోవడంతో.. టీమ్ మొత్తం కొల్యాప్స్ అవుతోంది. కానీ, ఇదే విరాట్ కోహ్లీ గతంలో యాంకర్ రోల్ పోషిస్తూ.. తాను క్రీజ్‌లో నిలబడి ఉంటే.. తన చుట్టూ టీమ్ ఆడేలా చూసుకునే వాడు. దాంతో అతని స్ట్రైక్ రేట్ కాస్త తగ్గేది. దానిపై చాలా మంది విమర్శలు చేశారు. స్లోగా ఆడుతున్నాడు, సెంచరీల కోసం ఆడుతున్నాడు అని నోరు పారేసుకున్నారు. కానీ, అదే కోహ్లీ విఫలం అవుతూ.. జట్టులో యాంకర్ రోల్ మిస్ అవ్వడంతో జట్టు పరిస్థితి దారుణంగా మారిపోయింది. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నా.. మిడిల్ ఓవర్స్‌లో యాంకర్ రోల్, వికెట్లను కాపాడుకుంటూ ఉండే బ్యాటర్ లేకపోవడంతో ఓటమే ఎదురవుతోంది. కోహ్లీ జట్టులో లేకపోయినా ఇదే పరిస్థితి ఉంది. జట్టులో ఉండి అతను విఫలైమనా అదే పరిస్థితి.
అయితే.. ఇక్కడ తన విలువ ఏంటో తెలియాలి కాబట్టి.. కోహ్లీ కావాలనే త్వరగా అవుట్ అవ్వడం లేదు.. దురదృష్టవశాత్తు రెండు వన్డేల్లోనే కోహ్లీ త్వరగానే అవుట్ అయ్యాడు. అలా కాకుండా కాస్త టైమ్ తీసుకొని.. స్లోగా బ్యాటింగ్ చేసి ఉంటే జట్టు పరిస్థితి కచ్చితంగా వేరేగా ఉండేది. కానీ, కోహ్లీ వికెట్ పడిపోవడంతో జట్టు నిలబడలేకపోతుంది. గతంలో కోహ్లీ పోషించిన యాంకర్ రోల్ అర్థంకాక స్లో బ్యాటింగ్ అంటూ విమర్శలు చేసినవాళ్లకు.. ఇప్పుడైనా కోహ్లీ విలువ తెలుసి ఉంటుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Without performance of Virat Kohli, India can’t win match against this Sri Lankan team. Whereas Kohli used to single handedly win the match against Prime SL pic.twitter.com/w0XMCFf83j
— ` (@116atAdelaide) August 5, 2024