Venkatesh Prasad: టీమిండియా ‘న్యూ చోకర్స్’ కాబోతుందా? వెంకటేష్ ప్రసాద్ ఎలా స్పందించాడు?

టీమిండియా కొత్త చోకర్స్ జట్టుగా మారబోతోందా? అని ఓ నెటిజన్ భారత మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ ను ప్రశ్నించాడు. దానికి అతడు కౌంటర్ ఇస్తూ..

టీమిండియా కొత్త చోకర్స్ జట్టుగా మారబోతోందా? అని ఓ నెటిజన్ భారత మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ ను ప్రశ్నించాడు. దానికి అతడు కౌంటర్ ఇస్తూ..

‘చోకర్స్’ క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ లో చోకర్స్ గా ముద్రపడిన ఏకైక జట్టు సౌతాఫ్రికా. సఫారీ టీమ్ మెగాటోర్నీల్లో కీలకమైన నాకౌట్ మ్యాచ్ ల్లో ఓడిపోతూ వచ్చేది. దీంతో ఆ జట్టును చోకర్స్ అని పిలవడం మెుదలుపెట్టారు. ఐసీసీ మెగాటోర్నీల్లో తొలి మ్యాచ్ ల్లో అద్భుతంగా విజయం సాధించి.. నాకౌట్ మ్యాచ్ లకు వచ్చేసరికి బోల్తాపడటం ప్రోటీస్ జట్టుకు ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం మరోసారి ఈ చోకర్స్ అనే పదం నెట్టింట వైరల్ గా మారింది. టీమిండియా కొత్త చోకర్స్ జట్టుగా మారబోతోందా? అని ఓ నెటిజన్ భారత మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ ను ప్రశ్నించాడు. దానికి అతడు ఎలా స్పందించాడు అంటే?

ప్రస్తుతం టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓ వైపు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి, మరోవైపు తాజాగా సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో భారత జట్టుపై విమర్శలు వచ్చాయి. టీమిండియా దిగ్గజాలతో పాటుగా, ఇతర దేశాలకు చెందిన లెజెండరీ ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టీమిండియా మాజీ ప్లేయర్ వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అందులో భాగంగా.. ఓ నెటిజన్ వెంకటేష్ ప్రసాద్ కు ఓ ప్రశ్న వేశాడు. ‘సర్ టీమిండియా వరల్డ్ క్రికెట్ లో మరో న్యూ చోకర్స్ అవుతుందా?’ గత 10 సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు, నాకౌట్ మ్యాచ్ ల్లో ఓడిపోతూ వచ్చిందని ప్రశ్నించాడు. దానికి వెంకటేష్ ప్రసాద్ రిప్లై ఇస్తూ..

“టీమిండియా చోకర్స్ టీమ్ కాదు. మేము రెండు టెస్ట్ సిరీస్ లు ఆస్ట్రేలియా గడ్డపై గెలిచాం. 36 పరుగులకు ఆలౌట్ అయిన దగ్గర నుంచి ఎంతో నేర్చుకుని ముందుకు సాగుతున్నాం. అయితే ఏమైందో ఏమో గానీ.. గత 11 సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం నిజంగా ఆశ్చర్యం. స్టార్ ఆటగాళ్లు మేజర్ టోర్నీలకు దూరం కావడంతోనే ఇలా జరిగింది అనుకుంటున్నాను” అంటూ సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు వెంకటేష్ ప్రసాద్. ఇదిలా ఉండగా గత దశబ్దకాలంగా టీమిండియా ఒక్క మేజర్ టోర్నీని గెలుచుకోలేకపోయింది. ఇది భారతీయులను అసంతృప్తికి గురిచేస్తున్న విషయం. మరి ఈ లోటును 2024 టీ20 ప్రపంచ కప్ తోనైనా భర్తీ చేయాలని భావిస్తోంది టీమిండియా. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి నెటిజన్ ప్రశ్నకు టీమిండియా మాజీ ఆటగాడు ఇచ్చిన ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments