iDreamPost
android-app
ios-app

Valentines Day 2024: వీడియో: వాలెంటైన్స్​ డే స్పెషల్.. మగాళ్లకు వార్నింగ్ ఇస్తూ ధావన్ రీల్!

  • Published Feb 14, 2024 | 4:13 PM Updated Updated Feb 14, 2024 | 4:35 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఓ రీల్ చేశాడు. మగాళ్లకు వార్నింగ్ చేస్తూ అతడు పోస్ట్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఓ రీల్ చేశాడు. మగాళ్లకు వార్నింగ్ చేస్తూ అతడు పోస్ట్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Feb 14, 2024 | 4:13 PMUpdated Feb 14, 2024 | 4:35 PM
Valentines Day 2024: వీడియో: వాలెంటైన్స్​ డే స్పెషల్.. మగాళ్లకు వార్నింగ్ ఇస్తూ ధావన్ రీల్!

ఇవాళ వాలెంటైన్స్ డే అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రేమికులు అందరూ ఈ స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాము లవ్ చేసిన వారికి ప్రపోజ్ చేయడం, ప్రేమకు గుర్తుగా గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు. పేరుకు ఇవాళ వాలెంటైన్స్ డే అయినప్పటికీ ఈ సంబురాలు వారం రోజుల ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీన రోజ్​ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే ఇలా మొత్తం వారానికి ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. ప్రేమను వ్యక్తపరచడం, లవ్ చేసిన వాళ్లు తమకు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకోవడం, ఆరాధనా భావాన్ని చూపించడం ఇలా ప్రతి రోజూ ఒక్కో విషయాన్ని మనకు నేర్పిస్తుంది. అయితే ప్రేమికుల రోజున భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ మాత్రం మగాళ్లకు ఓ వార్నింగ్ ఇచ్చాడు.

వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని ధావన్ ఇన్​స్టాగ్రామ్​లో ఓ రీల్​ను పోస్ట్ చేశాడు. మగాళ్లకు వార్నింగ్ ఇస్తూ సాగిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘నమస్కారం. పెళ్లయిన వారు ఏ మహిళతోనూ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవద్దు. కాదని వాళ్లతో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారా భార్య చేతిలో దెబ్బలు తినడం ఖాయం. ధన్యవాదాలు’ అంటూ ఆ రీల్ సాగింది. బ్యాగ్రౌండ్​లో ఆ డైలాగ్స్​ వినిపిస్తుండగా దాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు ధావన్. వివాహ బంధానికి గౌరవం ఇచ్చి భార్యతో సమయం గడపాలని.. కాదని ఇతర మహిళతో వాలెంటైన్స్ డే లాంటివి సెలబ్రేట్ చేసుకుంటే మగాళ్ల పని అయిపోయినట్లేనంటూ ఈ రీల్ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చాడు ధావన్.

ధావన్ రీల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు అతడు చెప్పింది చాలా మంచి విషయమని మెచ్చుకుంటున్నారు. ఇక, జట్టులో కొత్త కుర్రాళ్లు వచ్చేయడంతో సీనియర్ అయిన ధావన్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. రీఎంట్రీ కోసం ఎంతగా ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. దీంతో డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో ఆడుతున్నాడు గబ్బర్. ఇక, ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ జంట విడిపోయారు. రెండేళ్ల కిందే తాము సెపరేట్ అవుతున్నట్లు ప్రకటించారు. కానీ ఆ పిటిషన్ మీద​ 2023, అక్టోబర్ నెలలో విచారణ చేసిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్​ డేను భార్యతోనే జరుపుకోవాలని.. లేకపోతే వాళ్ల చేతుల్లో దెబ్బలు తప్పవంటూ ధావన్ రీల్ చేయడం ఇంట్రెస్టింగ్​గా మారింది. మరి.. మగాళ్లకు ధావన్ ఇచ్చిన వార్నింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ 11 ఇదే! డేంజర్‌ ప్లేయర్‌ ఇన్‌

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom