SNP
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా గ్రౌండ్‌లోనే రక్తం కక్కుకున్నాడు. ఈ ఘటనతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఖవాజాకు ఆ గాయం ఎలా అయింది? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా గ్రౌండ్‌లోనే రక్తం కక్కుకున్నాడు. ఈ ఘటనతో క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఖవాజాకు ఆ గాయం ఎలా అయింది? ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోనే రక్తం కక్కాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ వేసిన డెడ్లీ బౌన్సర్.. ఖవాజాను గాయపర్చింది. ప్రమాదకరమైన ఆ బౌన్సర్ ఖవాజా హెల్మెట్ కింది భాగంలో తగిలి.. దవడను కూడా బలంగా తాకింది. దీంతో.. అతని దవడ భాగానికి గాయం కావడంతో పాటు.. ఖవాజా రక్తం కక్కుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అంత ప్రమాదకరమైన బౌన్సర్ తగిలిన తర్వాత.. గ్రౌండ్ వీడిన ఖవాజా పరిస్థితి ఎలా ఉందో అని సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు.
కాగా, తన ఆరోగ్య పరిస్థితిపై ఖవాజానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాను ఇప్పుడు బానే ఉన్నానని పేర్కొనడంతో క్రికెట్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. క్రికెట్‌లో ఇలాంటి గాయాలు కావడం సాధారణమై అయినా.. ఖవాజా రక్తం కక్కుకోవడంతో మ్యాటర్ సీరియస్ అయింది. కానీ, అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. స్కాన్ తీయించారు. దీంతో పెద్ద ప్రమాదం ఏమి లేదని తెలిసింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించారు. తాను ఖవాజాతో మాట్లాడాడని, అతను బానే ఉన్నాడంటూ కమిన్స్ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌తో విజయాలతో సూపర్ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా అదే వరుసలో వెస్టిండీస్‌తో కూడా తొలి టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కరేబియన్లు కేవలం 120 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆస్ట్రేలియా ముందు కేవలం 26 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. ఈ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. అయితే.. ఈ 26 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలోనే ఖవాజా గాయపడి.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరి ఈ మ్యాచ్‌లో షమర్ డెడ్లీ బౌన్సర్‌కు ఖవాజా రక్తం కక్కుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A nasty moment as Usman Khawaja is hit on the chin by a Shamar Joseph short ball #AUSvWI pic.twitter.com/nF5nFqxgJJ
— cricket.com.au (@cricketcomau) January 19, 2024
Usman Khawaja remains upbeat despite receiving a head blow from Shamar Joseph. pic.twitter.com/utpfTl99Ey
— CricketGully (@thecricketgully) January 19, 2024