iDreamPost
android-app
ios-app

ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. యాషెస్ హిస్టరీలో 26 ఏళ్ల తర్వాత..!

  • Author singhj Published - 05:38 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 05:38 PM, Tue - 1 August 23
ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. యాషెస్ హిస్టరీలో 26 ఏళ్ల తర్వాత..!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​కు గొప్ప ముగింపు లభించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ సిరీస్ మరోమారి అభిమానులను ఫుల్​గా ఎంటర్​టైన్ చేసింది. ఈ సిరీస్​లో కొన్ని సందర్భాల్లో అయితే ప్రేక్షకులు మునివేళ్లపై నిల్చొని మ్యాచ్​ను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలుపు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఢీ అంటే ఢీ అనడంతో టీ20 క్రికెట్​ను మించిన ఉత్కంఠతో సిరీస్ సాగింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్​పై 49 రన్స్ తేడాతో నెగ్గింది ఇంగ్లండ్. దీంతో ఇరు టీమ్స్ సిరీస్​ను 2-2తో సమంగా పంచుకున్నాయి. ఐదో టెస్టు ఆఖరి రోజు గెలుపు కోసం రెండు జట్లు భీకర పోరాటాన్ని సాగించాయి. అయితే చివరికి విజయం ఇంగ్లీష్ టీమ్ సొంతమైంది.

యాషెస్ చివరి టెస్టు తర్వాత ఇద్దరు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అందులో ఒకరు దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కాగా.. మరొకరు స్టార్ ఆల్​రౌండర్ మొయిన్ అలీ. ఇకపోతే, యాషెస్ చివరి టెస్టులో ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఈ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు. యాషెస్​లో అద్భుతంగా రాణించిన ఈ బ్యాటర్.. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో కలుపుకొని ఓవరాల్​గా 496 రన్స్​తో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ హిస్టరీలో అరుదైన ఘనత సాధించిన ఓపెనర్ల జాబితాలో ఖవాజా చేరిపోయాడు.

యాషెస్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు 36 ఏళ్ల ఖవాజా. అతడి కంటే ముందు 1997లో కంగారూ మాజీ ఓపెనర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్​లో మొత్తంగా 556 రన్స్ చేశాడు. అతడి కెరీర్​లో సాధించిన మొత్తం రన్స్​లో సగానికి పైగా యాషెస్​లోనే స్కోర్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో దాదాపు 26 ఏళ్ల తర్వాత ఉస్మాన్ ఖవాజా 496 రన్స్ చేసి మాథ్యూ తర్వాతి ప్లేస్​ను ఆక్రమించాడు. 1997 అనంతరం యాషెస్​లో అత్యధిక రన్స్ చేసిన ఆసీస్ ఓపెనర్​గా నిలిచాడు. మొత్తానికి తన అద్భుతమైన బ్యాటింగ్​తో కంగారూ టీమ్ ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ అభిమానుల మనసులను దోచుకున్నాడు ఖవాజా.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş