iDreamPost
android-app
ios-app

Video: పాక్ ఆటగాళ్లు ఇంతే.. ఫ్రీ హిట్ కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్!

  • Published Dec 24, 2023 | 4:22 PM Updated Updated Dec 24, 2023 | 4:22 PM

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్థాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్ లో నవ్వులు పూయించాడు.

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్థాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్ లో నవ్వులు పూయించాడు.

  • Published Dec 24, 2023 | 4:22 PMUpdated Dec 24, 2023 | 4:22 PM
Video: పాక్ ఆటగాళ్లు ఇంతే.. ఫ్రీ హిట్ కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్!

సాధారణంగా క్రికెటర్ మ్యాచ్ లో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ అదేంటో ఆ సంఘటనల్లో దాదాపు పాకిస్థాన్ కు చెందిన ఆటగాళ్ల ప్రమేయమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్థాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్ లో నవ్వులు పూయించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

బిగ్ బాష్ లీగ్ 2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్ విజయం సాధించింది. కాగా.. ఈ పోరులో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మెల్బోర్న్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో తొలి బంతి వేసే క్రమంలో బౌలర్ స్టిక్టీ బాల్ ను వేయలేదు. దీంతో అంపైర్ నిబంధనల్లో భాగాంగా నోబ్ ప్రకటించి.. ఫ్రీ హిట్ ఇచ్చాడు. దీంతో నెక్ట్స్ బాల్ ను భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు బెన్ క్రాప్ట్. అయితే షాట్ కరెక్ట్ గా తగలకపోవడంతో.. బాల్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది.

ఈ క్రమంలోనే ఉసామా మీర్ వేగంగా పరిగెత్తుకొచ్చి అద్భుమైన క్యాచ్ ను డైవ్ చేసి మరీ అందుకున్నాడు. ఆ వెంటనే సంతోషంతో అరిచాడు. ఇంతలోనే బాల్ త్రో వేయమని మరో ప్లేయర్ చేయితో సైగ చేశాడు. అప్పుడు ఉసామా మీర్ కీపర్ వైపు త్రో చేశాడు. ఇది చూసిన ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో చిత్ర విచిత్రాలకు పాక్ ఆటగాళ్లు పెట్టింది పేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పాక్ ప్లేయర్లు అంతే పాక్ ప్లేయర్లు అంతే.. అంటూ సరదాగా కామెంట్స్ తో సెటైర్స్ వేస్తున్నారు. మరి ఫ్రీ హిట్ బాల్ కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్ చేసుకున్న పాక్ ఆటగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş